మళ్లీ పాత పాటే పాడిన ఖర్గే... కాంగ్రెస్...
ఎన్నికల్లో ఈవీఎం బదులు బ్యాలెట్ బాక్సులు వాడాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ట్యాంపరింగ్ చేసినట్లా అని
By : The Federal
Update: 2024-11-26 12:45 GMT
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ చిత్తుచిత్తుగా ఓడిన తరువాత ఈ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ బాక్సులను ఉపయోగించాలని ఆయన డిమాండ్ చేశారు.
"మాకు ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు) అక్కర్లేదు, బ్యాలెట్ పేపర్ కావాలి" అని న్యూఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. గతంలో మాదిరిగానే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా ఇదే సమయంలో సుప్రీంకోర్టు బ్యాలెట్ బాక్స్, ఈవీఎం విధానంపై కేసును విచారించింది.
సుప్రీంకోర్టు తీర్పు గొడ్డలిపెట్టు
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 288 స్థానాలకు గానూ 50 కంటే తక్కువ స్థానాల్లో విజయం సాధించి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. మంగళవారం కూడా, బ్యాలెట్ పేపర్‌కు తిరిగి రావాలన్న ఖర్గే డిమాండ్‌ను సుప్రీంకోర్టు బ్రేకు వేసింది.
పాత తరహ ఓటింగ్ విధానంలో బ్యాలెట్ బాక్స్ లకు తిరిగి రావాలని కేఏ పాల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడవు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయి’’ అని జస్టిస్‌లు విక్రమ్‌నాథ్, పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం పిటిషన్ దాఖలు చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
రాజ్యాంగంపై చర్చకు కాంగ్రెస్
ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువుల పంపిణీకి పాల్పడినట్లు తేలితే కనీసం ఐదేళ్లపాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఇదిలావుండగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే, ఆయన పార్టీ సహచరుడు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ఉభయసభల్లో రెండు రోజుల పాటు రాజ్యాంగంపై చర్చకు డిమాండ్ చేశారు.
రాజ్యాంగం గురించిన మంచి విషయాలు చర్చించడానికి, నేడు జరుగుతున్న తప్పుడు విషయాలను కూడా చర్చించడానికి వీలుగా దాని కోసం సమయం కేటాయించాలి" అని ఖర్గే చెప్పారు.
ద్వేషం చిమ్మడం ఆపండి: ఖర్గే
కుల గణన అంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిజంగా దేశంలో ఐక్యతను కోరుకుంటే, వారు విద్వేషాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. 'మోదీ మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు' మోదీది మైనారిటీ ప్రభుత్వమని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్‌లో నితీష్ కుమార్‌లపైనే ఆధారపడి ఉందని ఖర్గే అన్నారు. “ఎవరైనా (వారిలో) మద్దతు ఉపసంహరించుకుంటే ఈ ప్రభుత్వం పడిపోతుంది,” అని ఆయన అన్నారు.