బీజేపీ మరో ఎన్నికల గిమ్మిక్కుకు పాల్పడింది: ఢిల్లీ మాజీ సీఎం
మొదటి క్యాబినేట్ లోనే ఇస్తారని ఎందుకు ఇవ్వలేదని విమర్శలు;
By : The Federal
Update: 2025-02-22 12:52 GMT
ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హమీ ఇచ్చినట్లుగా మహిళలలకు నెలకు 25 వందల సాయం గురించి చర్చించడానికి తమకు సమయం కేటాయించాలని, మాజీ ముఖ్యమంత్రి, ఆప్ ఎమ్మెల్యే అతిషీ మార్లేనా ప్రభుత్వాన్ని కోరారు.
ఢిల్లీ సీఎం గుప్తాకు రాసిన లేఖలో అతిశీ పలు విమర్శలు చేశారు. కొత్త ప్రభుత్వం మొదటి క్యాబినేట్ లో సమావేశంలో ఎందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆమోదించలేదని ప్రశ్నించారు. ప్రధాని మంత్రి ఎన్నికల ర్యాలీలో ఈ పథకం వాగ్థానం చేసినట్లు గుర్తు చేశారు.
ఈ నెల ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పై ఘన విజయం సాధించిన బీజేపీ, ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చారు. మంత్రిమండలి గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధాని హమీని గుర్తు చేసిన ఆప్..
గత ఆప్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న అతిషీ, ఫిబ్రవరి 23న తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్ మెంట్ కోరారు. ‘‘జనవరి 31న ద్వారకాలో జరగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీ తల్లులు, సోదరీమణులకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నెలకు 2500 చెల్లింపు పథకాన్ని ఆమోదిస్తామని హమీ ఇచ్చారు. ’’
బీజేపీ మొదటి క్యాబినేట్ సమావేశం ఫిబ్రవరి 20 న జరిగింది. కానీ ఈ పథకం ఆమోదం పొందలేదు. మోదీని నమ్మిన ఢిల్లీ మహిళలు మోసం పోయారని అతిశీ అన్నారు.
ఇది మరో పోల్ జిమ్మిక్కా..
అంతకుముందు కూడా విలేకరులతో మాట్లాడిన ఆతిషీ.. తన ఎన్నికల హమీలను నెరవేర్చడంలో విఫలమైందని అధికార పార్టీని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు, ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ కూడా తమ మొదటి క్యాబినేట్ సమావేశంలో మహిళలకు సాయం కింద నెలకు 2500 అందిస్తారని హమీ ఇచ్చారు. కానీ మొదటి సమావేశం ముగిసింది. కానీ హమీ మాత్రం నెరవేరలేదు.
ప్రధాని మోదీ, గుప్తాతో కూడిన ప్రచార పోస్టర్లను ప్రదర్శిస్తూ వాగ్థానం చేసిన ఆర్థిక సాయం ఎప్పుడూ జమ అవుతుందో స్పష్టం చేయాలని అతిషీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇది మరో ‘‘ఎన్నికల జిమ్మక్కా’’ అని ప్రశ్నించారు.
ఢిల్లీ ఎన్నికల్లో మహిళలు కీలకపాత్ర పోషించారు. అందుకే రెండు పార్టీలు కూడా పోటాపోటీగా హమీలు గుప్పించాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తోంది.
తరువాత జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కంప్రోల్టర్ ఆడిటర్ జనరల్ నివేదికను ప్రవేశపెడుతుందనే బీజేపీ ప్రణాళికలను ఆమె తోసిపుచ్చారు. ఇదో సాధారణ విషయంగా అభివర్ణించారు. ఈ నివేదికలు గత ప్రభుత్వపు పనితీరును హైలైట్ చేస్తుందని ఆతీషీ అన్నారు.