బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోంది: కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి ఆదాయపన్ను రిటర్న్ లలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఐటీ శాఖ రూ. 17 వందల కోట్ల పెనాల్టీ విధించింది

Update: 2024-03-29 12:37 GMT

పార్టీకి రూ. 17 వందల కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ పన్ను ఉగ్రవాదాన్ని తమపై ప్రయోగిస్తోందని ఆరోపించింది. ప్రజాస్వామ్యం పై బీజేపీ దాడి చేస్తోందని విమర్శించింది.  IT ద్వారా తాజా నోటీసు 2017-18 నుంచి 2020-21 వరకు పెనాల్టీ వడ్డీ రెండింటినీ చెల్లించాలని నోటీసులో పేర్కొన్నట్లు గ్రాండ్ ఓల్డ్ పార్టీ వెల్లడించింది.

" మమ్మల్ని ఆర్థికంగా కుంగదీసేందుకే నోటీసులు పంపుతున్నారు, ఇది ట్యాక్స్ టెర్రరిజం, కాంగ్రెస్‌పై దాడికి దీన్ని వాడుతున్నారు, ఇది ఆపాలి" అని కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్ శుక్రవారం మీడియాతో అన్నారు. ఈ నోటీసులకు మేం భయపడబోం.. మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఈ ఎన్నికల్లో పోరాడతామని కేంద్ర మాజీ మంత్రి మీడియాకు చెప్పారు.
ఏప్రిల్ 19న ప్రారంభం కానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆదాయపు పన్ను శాఖను ఉపయోగించి బీజేపీ ఆర్థికంగా అణిచివేస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. తమ నిధులను స్తంభింపజేస్తూ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఆదేశాలను "ప్రజాస్వామ్యంపై దాడి"గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఆదాయపు పన్ను అధికారులు జాతీయ పార్టీకి ₹ 200 కోట్ల జరిమానా విధించడంతో పాటు దాని నిధులను కూడా స్తంభింపజేయడంతో నిధుల కొరత కారణంగా కాంగ్రెస్ ఇప్పటికే కష్టాల్లో ఉంది.
అయితే ఖాతాలను స్తంభింపచేయడంపై ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ ఆశ్రయించింది. అయితే అక్కడ పార్టీకి చుక్కెదురు అయింది. దీనిపై పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పన్ను రిటర్న్ లో తప్పులున్నాయని గుర్తించిన ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి రూ. 200 కోట్లు పెనాల్టీ విధించింది.
Tags:    

Similar News