ఎన్సీఈఆర్టీ పుస్తకాలను తగలబెట్టండి: కాంగ్రెస్
దేశ విభజనకు కాంగ్రెస్, జిన్నా, మౌంట్ బాటన్ కారణమని వివరణ.. రాహుల్ లో జిన్నా ఐడియాలజీ ఉందని ఎదురుదాడికి దిగిన బీజేపీ;
By : The Federal
Update: 2025-08-17 06:49 GMT
దేశ విభజనకు ముస్లిం లీగ్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నా, మౌంట్ బాటన్, కాంగ్రెస్ పార్టీ కారణమని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) ప్రత్యేక మాడ్యుల్ విడుదల చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి ఆగష్టు 14 ను ‘దేశ విభజన కాలం నాటి భయానక స్మృతుల దినం’గా ప్రకటించింది. దేశ విభజన కాలంలో లక్షలమంది నిర్వాసితులయ్యారని, ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, వారి సంస్మరణార్థం దీనిని జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీలో జరిగిన విలేకరులు సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఎన్సీఈఆర్టీ కొత్త మాడ్యూల్ విడుదల చేస్తూ కాంగ్రెస్ పేరు చేర్చడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ముఖ్యమైన వాస్తవాలను విడిచిపెట్టి కల్పిత చరిత్రను చేర్చిందని మండిపడ్డారు. బీజేపీ సైద్దాంతిక గురువు అయిన స్వయం సేవక్ సంఘ్ ను దేశ చరిత్రలో అతిపెద్ద విలన్ అని అభివర్ణించారు.
చారిత్రక వివరణ..
‘‘1938 గురించి అందులో ఎందుకు ప్రస్తావించబడలేదు? ’’ అని ఏఐసీసీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ అయిన ఖేరా ప్రశంసించారు. గుజరాత్ లో జరిగిన హిందూ మహాసభ జాతీయ సమావేశం హిందువులు, ముస్లింలు ఒకే దేశంగా జీవించలేరని ప్రకటించిన సంవత్సరం చాలా ముఖ్యమైన తేదీ అని చెప్పారు.
‘‘మనం 1940 కి ముందుకు వెళ్తే ఏం జరిగిందో తెలుస్తుంది. లాహోర్ లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశంలో పాకిస్తాన్ మాజీ గవర్నర్ జనరల్ హిందూ మహాసభ చెప్పిన దానిని రెండు సంవత్సరాల తరువాత చెప్పాడని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ను సమర్థిస్తూ 1942 లో మహ్మతాగాంధీ నేతృత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి పార్టీ నాయకులు ప్రాంతీయ అసెంబ్లీలను విడిచిపెట్టారని ఖేరా చెప్పారు.
‘‘హిందూ మహాసభ, ముస్లిం లీగ్ ఎన్డీబ్ల్యూఎఫ్పీ, బెంగాల్, సింధ్ వంటి ప్రావిన్స్ లలో సంకీర్ణ పాలనలను ఏర్పాటు చేసుకున్నాయి. సింధ్ అసెంబ్లీలో విభజన ప్రతిపాదనను హిందూ మహాసభ, ముస్లిం లీగ్ తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇది ఎన్సీఈఆర్టీ మాడ్యూల్ లో ప్రవేశపెట్టారా? ’’ అని ఖేరా ప్రశ్నించారు.
పుస్తకానికి నిప్పు పెట్టండి..
ఇవన్నీ ఎన్సీఆర్టీ మాడ్యుల్ ప్రస్తావించకపోతే దాన్ని తగలబెట్టండని అని అన్నారు. భారత్ విభజనకు కారణం హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కారణమని ఆరోపించారు. ‘‘ఈ చరిత్రలో ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే. తరాలు వారిని క్షమించవు’’ అని ఆయన అన్నారు.
మాడ్యూల్ లో ఏం ఉంది...
విభజన నేరస్థుల అనే ప్రత్యేక విభాగంలో ఎన్సీఈఆర్టీ ‘‘ చివరికి ఆగష్టు 15, 1947 నాటికి భారత్ విభజించబడింది. కానీ ఇది ఏ ఒక్క వ్యక్తి చేసిన పనికాదు. భారత దేశ విభజనకు మూడు అంశాలు కారణమయ్యాయి. దానిని డిమాండ్ చేసింది జిన్నా, రెండోవది దాన్ని అంగీకరించిన కాంగ్రెస్, మూడోది దాన్ని అమలు చేసిన మౌంట్ బాటెన్’’ అని పేర్కొంది.
‘‘కానీ మౌంట్ బాటన్ ఒక పెద్ద తప్పుకు పాల్పడ్డాడని పేర్కొంది. ఆయన జూన్ 1948 నుంచి ఆగష్టు 1947కు ముందుకు స్వాతంత్య్రాన్ని ముందుకు జరిపాడు. దీనికి అందరూ అంగీకరించేలా ఒప్పించాడు. దీని కారణంగా విభజనకు ముందు పూర్తి సన్నాహాలు చేయలేకపోయాడు.
విభజన సరిహద్దుల విభజన కూడా తొందరగా జరిగింది. దానికోసం సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ కు కేవలం ఐదు వారాల సమయం మాత్రమే ఇచ్చాడు. పంజాబ్ లో ఆగష్టు 15, 1947 తరువాత రెండు రోజుల తరువాత కూడా లక్షలాది మంది ప్రజలు తాము భారత్ లో ఉన్నారో లేదా పాకిస్తాన్ లో ఉన్నారో తెలియదు అంత తొందరపాటు గొప్ప అజాగ్రత్త చర్య’’ అని వివరించింది.
దేశ విభజన అనివార్యమని చెప్పిన మాడ్యుల్ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, మొదటి ఉప ప్రధాని, హోంమంత్రి సర్థార్ వల్లభాయ్ పటేల్ అంతర్యుద్ధ భయంగా కారణంగా విభజనను అంగీకరించారని పేర్కొంది. ఇద్దరూ అంగీకరించినప్పుడూ మహాత్మాగాంధీ కూడా విభజనకు తన వ్యతిరేకతను వదులకున్నారు.
ఈ మెటీరియల్ ఆరు నుంచి 8, 9 నుంచి 12 తరగతులకు ప్రత్యేక వర్షన్ లో తయారు చేశారు. ఇది సాధారణ పాఠ్య పుస్తకాల వెలుపల ఒక అనుబంధ వనరుగా, ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ ప్రాజెక్ట్ లు, చర్చల ద్వారా విద్యార్థులకు అందేలా చేశారు.
విభజన సమస్యలకు దారి తీసింది..
విభజన భారతదేశానికి భవిష్యత్ లో భద్రతా సంబంధమైన సమస్యలతో సహ అనేక సమస్యలకు దారితీసిందని మాడ్యూల్ పేర్కొంది. ‘‘మిగిలిన భారత్ స్నేహపూర్వకంగా లేని సరిహద్దులతో చుట్టుముట్టబడింది.
ఇది కొత్త భద్రతా సమస్యలకు దారి తీసింది. ఒక దేశంలో రెండు ప్రధాన వర్గాల మధ్య మతపరమైన శత్రుత్వం అలాగే ఉంది. దీనితో పాటు జమ్మూకాశ్మీర్ కొత్త సమస్యగా ఉద్భవించింది. ఇది భారత్ లో ఇంతకుముందు ఎన్నడూ లేదు’’ అని పేర్కొంది.
2021 లో విభజన భయానక జ్ఞాపక దినోత్సవం ను ప్రకటించే సమయంలో ప్రధాని చెప్పిన విషయాలను కూడా మాడ్యుల్ ప్రస్తావించింది. ‘‘విభజన బాధలను ఎప్పటికీ మరిచిపోలేము. లక్షలాది మంది సోదరిమణులు, సోదరులు నిరాశ్రయులయ్యారు. చాలామంది పనికిరానీ ద్వేషం, హింస కారణంగా ప్రాణాలు కోల్పోయారు’’ అని ఎక్స్ లో పోస్ట్ పేర్కొన్నారు.
విరుచుకుపడిన బీజేపీ..
ఎన్సీఈఆర్టీ మాడ్యుల్ ను విభజనపై కాంగ్రెస్ చేసిన విమర్శలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. దేశ విభజనను కాంగ్రెస్ ఆపలేదని విమర్శించారు.
‘‘నేను కాంగ్రెస్ ను అడగాలనుకుంటున్నాను. చివరి క్షణంలో దీన్ని ఆపగల శక్తి ఎవరికి ఉంది? కాంగ్రెస్, మహ్మద్ అలీ జిన్నా అమలు చేసిన ద్విజాతి సిద్దాంతం అందరికి తెలుసు. కాంగ్రెస్ ఇప్పటికీ ముస్లింలు, మొదటగా భారత విభజన గురించి మాట్లాడుతోంది’’ అతని ఆయన అన్నారు.
బీజేపీ మరో జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను రాహుల్ - జిన్నా పార్టీగా ఎగతాళి చేశారు. కాంగ్రెస్ నిజాన్ని జీర్ణించుకోలేకపోయిందని, అది చూసి కలత చెందిందని అన్నారు.
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, జిన్నాకు పర్యాయపదం అన్నారు. ఆయన ప్రకారం.. పాకిస్తాన్ నాయకుడి బుజ్జగింపు, మతతత్వం గురించి విషపూరితమైన ఆలోచనలు నేటీ నకిలీ గాంధీ అయిన రాహుల్ గాంధీలో, కాంగ్రెస్ లో కనిపిస్తాయి’’ అని దుయ్యబట్టారు.