నీట్ స్కామ్ పై సీబీఐ దూకుడు.. గుజరాత్ లో సోదాలు

నీట్ స్కామ్ పై సీబీఐ దూకుడుపెంచింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో నమోదు అయిన అన్ని కేసులను తన ఆధీనంలోకి తీసుకుంది.

Update: 2024-06-29 10:33 GMT

నీట్ పరీక్షలో అవకతవకలకు సంబంధించి గుజరాత్‌లోని ఏడు చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం (జూన్ 29) సోదాలు నిర్వహించింది. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోద్రా జిల్లాల్లో సోదాలు జరిగాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

జార్ఖండ్ లో అరెస్టులు
నేషనల్-ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యుజి) ప్రశ్నపత్రం లీక్ అయిన కేసులో జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఒక జర్నలిస్టును సిబిఐ అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత సోదాలు జరిగాయి. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్షకు ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్ హజారీబాగ్ సిటీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఆయన పేపర్ లీక్ చేయడంలో కీలక పాత్ర పోషించడాని సీబీఐ ఆరోపణ.
జర్నలిస్టు అరెస్ట్
వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలమ్‌ను ఎన్‌టిఎ పరిశీలకుడిగా, ఒయాసిస్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్‌గా నియమించినట్లు అధికారులు తెలిపారు, సిబిఐ జిల్లాకు చెందిన మరో ఐదుగురిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు సాయం చేయడానికి ప్రయత్నించినందుకు వార్తాపత్రికలో పనిచేసిన జర్నలిస్ట్ జమాలుద్దీన్ అన్సారీని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
సీబీఐ విచారణ
నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది, ఇందులో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచనపై సొంత ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు చేపట్టిన రాష్ట్రాలవి ఐదు ఉన్నాయి. బీహార్, గుజరాత్‌లలో నమోదైన ఒక్కో కేసును, రాజస్థాన్‌లోని మూడు కేసులను ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు ప్రారంభించింది.
నీట్ పరీక్ష..
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో MBBS, BDS, ఆయుష్ ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాల కోసం NTA ద్వారా NEET-UG నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్ష మే 5న దేశంలోని 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. విదేశాల్లోని 14 కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఒక రోజు తర్వాత జూన్ 23 న మొదటి ఎఫ్‌ఐఆర్ సీబీఐ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.
Tags:    

Similar News