పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేసిన కేంద్రం
ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీ, లేఖ రాసి వివరణ కోరిన కేంద్రం;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-28 07:09 GMT
భారత్ కు, మన దేశ సైన్యం, భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టె వీడియోలను పాకిస్తాన్ సామాజిక మాధ్యమాలు, యూట్యూట్ వేదికగా ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తప్పుదారి పట్టించే సమాచారం ప్రచారం చేశారని ఆరోపిస్తూ.. డాన్ న్యూస్, ఆరీ న్యూస్ తో సహ 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్ ను బ్లాక్ చేసింది.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది హిందువులు మరణించారు. వీరిని కేవలం మతం అడిగి ముస్లింలు కాదని చంపేశారు. ఈ సంఘటన తరువాత హోంమంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిషేధించబడిన ఇతర యూట్యూబ్ ఛానెల్ లో ఇర్షాద్ భట్టి చెందిన సామా టీవీ, బోల్ న్యూస్, రాఫ్తార్, ది పాకిస్తాన్ రెఫరెన్స్, జియో న్యూస్, సామా స్పోర్ట్స్, జీఎన్ఎన్, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్ క్లూజివ్, ఆస్మా సిరాజ్, మునిబ్ ఫారూకీ, సునో న్యూస్,రాజీ నామా వంటివి ఉన్నాయి.
బీబీసీకి లేఖ..
పహల్గామ్ విషాదంపై బీబీసీ పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదులను మిలిటెంట్లు అని అభివర్ణించడంపై ప్రభుత్వం బీబీసీకి అధికారిక లేఖను కూడా పంపింది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా ఉగ్రవాదులకు మద్దతుగా వార్తలు ప్రసారం చేయడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ బీబీసీ భారత ప్రతినిధి జాకీ మార్టిన్ కు లేఖ పంపింది.
‘‘ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా పేర్కొనడంపై బీబీసీకి అధికారిక లేఖ పంపబడింది. విదేశాంగమంత్రిత్వ శాఖ బాహ్య ప్రచార విభాగం బీబీసీ నివేదికలను పర్యవేక్షిస్తుంది’’ అని అధికారి తెలిపారు.
నాలుగో రోజు కూడా పాక్ కాల్పులు..
జమ్మూకాశ్మీర్ లోని ఫూంచ్, కుప్వారా జిల్లాల్లో పాకిస్తాన్ దళాలు ఎటువంటి కవ్వింపు లేకుండా కాల్పులకు తెగబడ్డాయని, ఎల్ఓసీ వెంట కాల్పులు విరమణ ఉల్లంఘనలను కొనసాగిస్తున్నాయని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ చిన్నపాటి కాల్పులకు పాల్పడటం వరుసుగా ఇది నాలుగో రోజు కావడం గమనార్హం.
‘‘ఏప్రిల్ 27-28 రాత్రి సమయంలో కుప్వారా, పూంచ్ జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు ఎటువంటి కవ్వింపు లేకుండా చిన్న ఆయుధ కాల్పులు జరిగాయి’’ అని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్ దళాలు ఈ చర్యపై వేగంగా స్పందించాయని ఆయన అన్నారు.
పాక్ పై కచ్చితంగ ప్రతీకారదాడులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తుండగా, ఆర్మీచీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతితో పాటు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కూడా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.