జే అండ్ కే: కొత్త నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు కేంద్రం సన్నాహాలు

సింధు ఉపనదులపై జల విద్యుత్ ప్రాజెక్ట్ లు నిర్మించబోతున్న కేంద్రం?;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-05 11:56 GMT
జమ్మూకాశ్మీర్ లోని ఓ జలవిద్యుత్ కేంద్రం

పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టిన న్యూఢిల్లీ ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.

జమ్ముకాశ్మీర్ లోని రెండు జల విద్యుత్ ప్రాజెక్ట్ లలో లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనిని ప్రభుత్వం ప్రారంభించిందని జాతీయ మీడియా పేర్కొంది.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఇంతకుముందు నిలిపివేసిన ఆరు ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని వేగవంతం చేసే అవకాశం ఉంది. సవాల్కోట్ లో 1856 మెగావాట్ల ప్రాజెక్ట్ తో పాటు కిర్తాయ్ లోని 1320 మెగావాట్ల మరో ప్రాజెక్ట్, పాకల్ దుల్ లో వెయ్యి మెగావాట్లు, మరో మూడు కొత్త ప్రాజెక్ట్ లు ప్రతిపాదించబోతున్నారు. ఈ మూడు కొత్త ప్రాజెక్ట్ లు 2224 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి.
అదనపు విద్యుత్ ఉత్పత్తి...
ఈ ఆరు ప్రాజెక్ట్ లు పూర్తయితే జమ్మూకాశ్మీర్ లో అదనంగా పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మైదాన ప్రాంతాలలో నీటిపారుదల, గృహా వినియోగానికి ఈ నీటిని వినియోగించుకోవచ్చు.
సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ అమలులో ఉంటే భారత్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఆరు నెలల ముందు పాకిస్తాన్ ను నోటీస్ ఇవ్వాల్సి ఉండేది. ఈ సమయంలో ఇస్లామాబాద్ ప్రాజెక్ట్ లను ఆలస్యం చేయడానికి లేదా రద్దు చేయడానికి అనేక చట్టపరమైన సవాళ్లను సృష్టించేది. కానీ పహల్గామ్ దాడి తరువాత న్యూఢిల్లీ ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టింది. 
ఫ్లషింగ్ రిజర్వాయర్లు..
ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ జలవిద్యుత్ సంస్థ సలాల్, బాగ్లీహార్ ప్రాజెక్ట్ ల స్పిల్ వేలను మూసివేసింది. అలాగే అక్కడ ఉన్న రిజర్వాయర్ ఫ్లషింగ్ ను తొలగించడం కూడా నిర్వహించింది.
1987 లో వాటిని నిర్మించినప్పటికీ అక్కడ మేట వేసిన అవక్షేపాలను ఇంకా తొలగించలేదు. నదీ దిగువన ఉన్న దేశాలు ఫ్లషింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలాగే నీటి వృథాకు దారి తీస్తాయి.
ఫ్లషింగ్ వల్ల సమర్థవంతంగా నీటి విద్యుత్ ఉత్పత్తికి దారి తీస్తుంది. ఇది టర్బైన్లకు నష్టం జరగకుండా చేస్తుందని జాతీయ మీడియా తెలియజేసింది. అయితే పాక్ అభ్యంతరాలతో వీటిని గత మూడు దశాబ్ధాలలో సరిగా ఫ్లషింగ్ చేయలేదు.
ప్రాజెక్ట్ ల పునరుద్దరణ..
జమ్మూ కాశ్మీర్ లో ఇంతకుముందు ప్రతిపాదించిన ఆరు ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ కేంద్రం హోంమంత్రి అమిత్ షా, జలవనరులు మంత్రి సీఆర్ పాటిల్, విద్యుత్ మంత్రి ఎంఎల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహన్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు.
అమిత్ షా, పాటిల్ వారి మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య ఇప్పటికే రెండు సమావేశాలు జరిగాయి. ఇందులో చీనాబ్, జీలం, నదుల వెంబడి కొత్త ప్రాజెక్ట్ లను ప్రారంభించడం, పులార్ సరస్సును పునరుద్దరించడం వంటి ఇతర అంశాలు చర్చించినట్లు తెలిసింది. ఈ నదులు పాక్ కు నీటి అవసరాలలో దాదాపు 80 శాతం తీరుస్తాయి.
పహల్గామ్ దాడిలో తమ పాత్రను తిరస్కరించిన పాకిస్తాన్, తమ దేశానికి నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైన యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. రక్షణ మంత్రి ఖాజా ఆసీఫ్ మాట్లాడుతూ.. సింధు, దాని ఉపనదులపై భారత్ ఎలాంటి ప్రాజెక్ట్ లు నిర్మించిన వాటిని పేల్చివేస్తామని హెచ్చరించారు. అయితే భారత్ వీటిని పట్టించుకోకుండా ఆనకట్టలు నిర్మించడానికే ముందుకు వెళ్తోంది.
Tags:    

Similar News