చత్తీస్ గఢ్ జర్నలిస్టు హత్య: నిందితుడు హైదరాబాద్ లో పట్టివేత
నిందితులు మీ పార్టీ వారంటే మీ పార్టీ వారని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు;
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన జర్నలిస్టు హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ చంద్రకర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్ లో సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.వృత్తిరీత్య కాంట్రాక్టర్ అయిన నిందితుడు ఈ ఏడాది జనవరి 3న జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ను హత్య చేసి తరువాత పారిపోయాడు.
ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని సురేంద్ర చంద్రాకర్ ను అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈకేసులో ఇప్పటికే ఆయన సోదరులు రితేష్ చంద్రకర్, దినేష్ చంద్రకర్, వారి సూపర్ వైజర్ మహేంద్ర రామ్ టేకేలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
ప్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ముఖేష్ చంద్రకర్(33) జనవరి 1న అదృశ్యమయ్యాడు. అతను డెడ్ బాడీ బీజాపూర్ పట్టణంలోని చత్తన్ పర బస్తీలోని సురేంద్ర చంద్రకర్ కు చెందిన సెప్టిక్ ట్యాంకులో అతని శవం దొరికింది.