‘ దసరా తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారట..’
ముఖ్యమంత్రి పదవిలో ఉండి భార్య పేరిట అక్రమాలకు పాల్పడిన సీఎం దసరా తరువాత రాజీనామా చేస్తారని ఓ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ చీఫ్ నమ్మకంగా చెబుతున్నారు.
By : The Federal
Update: 2024-10-07 09:42 GMT
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దసరా తరువాత రాజీనామా చేస్తాడని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ముడా స్కామ్ కేసులో సీఎం భార్య పేరు బయటకు రావడంతో కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ప్రతిపక్ష బీజేపీ సీఎం రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నాయి.
జేడీ(ఎస్) నేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, షెడ్యూల్ కంటే ముందే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయని, 2028 వరకు వచ్చే ఎన్నికల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని అన్నారు.
గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
“సీఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని రోజూ మీడియా ముందు స్పష్టం చేసేలా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది.. ఆయన పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.. కొందరు మంత్రులు కూడా సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని పేర్కొంటున్నారు. మరోవైపు, సిద్ధరామయ్య సతీష్ జార్కిహోళిని (సీనియర్ మంత్రి) ఢిల్లీకి పంపారు...." అని విజయేంద్ర అన్నారు.
మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడం ఖాయమన్నారు. సీఎం రాజీనామా చేయాలని కోరుతూ మా పాదయాత్ర (బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర) ముగిసిన వెంటనే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేను రాజకీయ ప్రకటన చేయడం లేదు. ఢిల్లీ స్థాయిలో దీనిపై ఆలోచనలు వస్తున్నాయి. దసర తరువాత ఎప్పుడైన ఈ ప్రకటన వెలువడవచ్చని విజయేంద్ర అన్నారు. దీనికి సంబంధించి సమాచారం తనకు ఉందన్నారు.
‘‘ ఈ విషయం సిద్దరామయ్యకు కూడా తెలుసు.. సిద్ధరామయ్య నేతృత్వంలోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి శాపంగా మారింది.. ఆయన రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన రాజీనామా చేస్తానన్నారు. దసరా తర్వాత ఈ విషయం ప్రతిచోటా వింటాం’’ విజయేంద్ర వాదన. సీఎం తన భార్య పార్వతి బీఎంకు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా 14 స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు.
సిద్ధరామయ్య భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, భూమి అమ్మిన దేవరాజు పై కేసులు నమోదు అయ్యాయి. మల్లికార్జున స్వామి భూమిని కొనుగోలు చేసి పార్వతికి బహుమతిగా ఇచ్చారు. చన్నపట్నలో జరిగిన జేడీ(ఎస్) సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయన్నారు.
మీరు వచ్చే ఎన్నికల కోసం 2028 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ దుశ్చర్యల వల్ల ఎన్నికలు ముందుగానే రావచ్చు...." "వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది మాకు (ప్రతిపక్షం) అవసరం లేదు. ఈ ప్రభుత్వాన్ని తొలగించండి " అని కుమారస్వామి అన్నారు.