ఢిల్లీ పేలుడు: వైట్ కాలర్ టెర్రర్ కేసులో శ్రీనగర్ వ్యక్తి అరెస్ట్

దర్యాప్తు చేస్తున్న కొద్ది పట్టుబడుతున్న ఉగ్రవాదులు

Update: 2025-11-23 11:25 GMT

‘‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’’ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసుల దర్యాప్తు సంస్థ శనివారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. పోలీసుల అధికారుల ప్రకారం.. అరెస్ట్ చేయబడిన వ్యక్తిని శ్రీనగర్ లోని బటమలూ ప్రాంతానికి చెందిన తుఫైల్ నియాజ్ భట్ గా గుర్తించారు.

వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్..
అక్టోబర్ మధ్యలో బన్ పోరా, నౌగామ్ లలో అతికించిన జేఎంఎం టెర్రరిస్ట్ పోస్టర్లపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తరువాత మొత్తం ఉగ్రవాద మాడ్యూల్ ను బయటపడింది.
ఈ కేసుకు సంబంధించి ఎస్పీ జీవీ సందీప్ చక్రవర్తి స్వయంగా దర్యాప్తుకు నాయకత్వం వహించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.
వారు ఆరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్. వీరిని విచారించగా మాజీ పారామెడిక్ ఇమామ్, పోస్టర్లు సరఫరా చేశారని, దీని వెనక మౌల్వీ ఇర్ఫాన్ అహ్మాద్ ఉన్నారని గుర్తించి అరెస్ట్ చేశారు.
ఢిల్లీ పేలుడు
దర్యాప్తులో భాగంగా అధికారులు ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ డాక్టర్ ముజఫర్ గనై, డాక్టర్ షాహీన్ సయీద్ లను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వైద్యులు గనై, ఉమర్ నబీ, ముజఫర్ రాథర్ అనే ముగ్గురు త్రయం ఈ మాడ్యూల్ ను నడుపుతున్నారని పరిశోధకులు భావిస్తున్నారు. నవంబర్ 10న న్యూఢిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలి 15 మంది మరణించారు. కారును నడిపించి డాక్టర్ ఉమర్ అని తేలింది.
Tags:    

Similar News