సెషన్స్ కోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ముఖ్యమంత్రి..

లిక్కర్ స్కామ్ పై విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపిన పట్టించుకోకపోవడంతో, ఈడీ దిగువ కోర్టులో ఫిర్యాదు చేసి నోటీసులు పంపింది. వాటిపై కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును..

Update: 2024-03-14 05:51 GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనపై దిగువ కోర్టు లో ఫిర్యాదు చేసి జారీ చేసిన సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ దరఖాస్తులను అదనపు సెషన్స్‌ జడ్జి రాకేష్‌ సియాల్‌ గురువారం (మార్చి 14) విచారించే అవకాశం ఉంది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) దివ్య మల్హోత్రా జారీ చేసిన ఉత్తర్వులపై కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మార్చి 16 న విచారణకు హాజరుకావాలని అందులో న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ కేసులో కేజ్రీవాల్‌కు పలుమార్లు సమన్లు జారీ చేసినందుకు గాను ఆయనపై విచారణ జరపాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మెజిస్టీరియల్ కోర్టులో రెండు ఫిర్యాదులు దాఖలు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 50 కింద ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ పంపిన ఎనిమిది సమన్లను గౌరవించలేదని తన ఫిర్యాదులో కోర్టు ముందుకు తెచ్చింది.
ప్రస్తుతం రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు జారీ చేసిన మొదటి మూడు సమన్‌లకు హాజరు కానందుకు ఆయనను ప్రాసిక్యూషన్ చేయాలని కోరుతూ ED గతంలో మెజిస్ట్రియల్ కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు ఏజెన్సీ జారీ చేసిన ఎనిమిది సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదని దర్యాప్తు సంస్థ కోర్టుకు నివేదించింది.


Tags:    

Similar News