కేజ్రీవాల్ కేసు: వారంలోగా కౌంటర్ దాఖలు చేయండి: ఢిల్లీ హైకోర్టు
తన అరెస్ట్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీ సమయం అడగడంపై కేజ్రీవాల్ తరఫున కేసు వాదిస్తున్న లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
By : The Federal
Update: 2024-03-27 09:30 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై వారం రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయలని ఈడీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏజెన్సీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వాదనలు వినిపిస్తూ తమ వాదనలను దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. మధ్యంతర బెయిల్ కోసం కౌంటర్ వేయడానికి తమకు తగినంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై కోర్టు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఇస్తామని తేల్చి చెప్పింది.
అయితే కేజ్రీవాల్ తరఫున ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును వాదిస్తున్న కాంగ్రెస్ నేత, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాదీ అభిషేక్ మనుసింఘ్వి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ రాకుండా సమయం వృథా చేయడానికే మూడు వారాలు అడుగున్నారన్నారు. "అసలు అరెస్ట్ అక్రమం. కేసు పునాదులపైనే అనుమానాలు ఉన్నాయి.. ఇదీ కీలకసమయం కాబట్టి అభ్యంతరాలున్నాయి" అని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో తన రిమాండ్ అక్రమమని, అరెస్ట్ ద్వారా తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైయ్యని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. నేరాన్ని నిరూపించడంలో ED విఫలమైందని కేజ్రీవాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అతడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని, రిమాండ్ రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. సప్లిమెంటరీ లిస్ట్‌ను పూర్తి చేసిన తర్వాత ఈ రోజు విచారణ చేపడతామని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, అరెస్టు ED రిమాండ్ కారణంగా అతనిని తక్షణమే విడుదల చేయాలని కోరింది. మార్చి 21 కేజ్రీవాల్ అరెస్టు తరువాత ఢిల్లీ కోర్టు మార్చి 28 వరకు ED కస్టడీకి అప్పగించింది. తనకు ముందస్తు రక్షణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ కు అక్కడ చుక్కెదురైంది. దాంతో దర్యాప్తు సంస్థ ఆ రోజు సాయంత్రమే ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసింది.