ఢిల్లీ: బంగ్లా హైకమిషన్ ను ముట్టడించిన హిందూ సంఘాలు

బంగ్లాదేశ్ లో హిందువును పాశవికంగా కొట్టిచంపడంపై ఆగ్రహం, యూనస్ కు వ్యతిరేకంగా నినాదాలు

Update: 2025-12-23 11:27 GMT
బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు

బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అశాంతిలో ఓ హిందువును పాశవికంగా కొట్టి చంపడంపై దేశంలోని హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు హిందూ సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వేలాది వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

దీనితో రాయబార కార్యాలయం దగ్గర మంగళవారం తెల్లవారుజాము నుంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతాన్ని మూడు అంచెల బారికేడ్లను ఏర్పాటు చేసి, పోలీసులు, పారామిలిటరీ సిబ్బందితో పాటు అదనపు బలగాలను మోహరించారు.

యూనస్ కు వ్యతిరేకంగా నినాదాలు..
ఇస్లాంను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హిందూ వ్యక్తి దీపుదాస్ ను కొట్టి చంపిన ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ లోని తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బారికేడ్లను దాటి బంగ్లాదేశ్ హైకమిషన్ వైపు కవాతు చేయడానికి ప్రయత్నించగా నిరసనకారులు పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు.
దుర్గబాయ్ దేశ్ ముఖ్ సౌత్ క్యాంపస్ మెట్రోస్టేషన్ సమీపంలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రతపై దృష్టిసారించిన ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.
దీనితో అధికారులు బారికేడ్లు, అదనపు పోలీస్ సిబ్బంది మోహరించడం వంటి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనకారులలో ఒక వర్గం ముందుకు దూసుకువచ్చి బారికేడ్లను తోసుకుని, సురక్షిత ప్రాంతం వైపు ముందుకు సాగడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ‘‘భారత్ మాతాకీ జై, యూనస్ సర్కార్ హోష్ మే ఆవో’’ అవంటి నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
భారత హైకమిషనర్ కు బంగ్లా సమన్లు..
నిరసనల నేపథ్యంలో భద్రతా సమస్యలను పేర్కొంటూ బంగ్లాదేశ్ న్యూఢిల్లీ అగర్తలాలలో కాన్సులర్, వీసా సేవలను నిలిపివేసింది. తన దౌత్యకార్యాలయం వెలుపల నిరసనలు, సంఘటనలపై తన అభ్యంతరాలను తెలియజేయడానికి ఢాకా భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను కూడా పిలిపించింది.
న్యూఢిల్లీ, సిలిగురి లోని తమ సంస్థలపై జరిగిన దాడులపై బంగ్లాదేశ్ ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్యసంస్థలపై హింస,బెదిరింపులను ఖండించింది.
‘‘ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, దేశంలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలు, సంబంధిత సౌకర్యాల భద్రతను నిర్ధారించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వాన్ని కోరింది’’ అని జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది.
బంగ్లా ఆరోపణలను తోసిపుచ్చిన భారత్..
అయితే బంగ్లాదేశ్ చేసిన భద్రతా ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. న్యూఢిల్లీలోని నిరసన క్లుప్తంగా ఉందని, ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది. బంగ్లాదేశ్ లోని మీడియా సంస్థలలో కొన్ని తప్పుదోవపట్టించే ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. దీపుచంద్రదాస్ భయంకర హత్యపై ఆగ్రహం, బంగ్లాదేశ్ లోని మైనారిటీల భద్రతపై అంతర్జాతీయ ఆందోళనతో ప్రదర్శనలు నడిచాయని పేర్కొంది.
Tags:    

Similar News