ప్రభుత్వ గుండెల్లో బ్యాంకు డిపాజిట్ల గల్లంతు గుబులు

కర్ణాటక ప్రభుత్వం ఉన్న ఫలంగా జాతీయ బ్యాంకులైన ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లతో పాటు ప్రభుత్వ లావాదేవీలను నిలిపివేయాలని భావిస్తోంది.

Update: 2024-08-20 09:30 GMT

ఇప్పటికే ముడా స్కామ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్నాటక ప్రభుత్వానికి ఇప్పుడు బ్యాంకు కుంభకోణం మెడకు చుట్టుకుంటోంది. ముఖ్యంగా బోర్డులు, కార్పొరేషన్‌ల అధికారులు వడ్డీ కోసం వివిధ బ్యాంకుల్లో అక్రమంగా నిధులను నిలిపివేస్తున్నారని, కొందరు బ్యాంకు అధికారులతో చేతులు కలిపి ఈ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేశాయి.

ఇటీవలి రెండు సంఘటనలు ఈ అంశాన్ని బహిర్గతం చేశాయి. అందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ప్రభుత్వం అన్ని లావాదేవీలను 15 రోజుల పాటు నిలిపివేసింది. కొన్ని నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది.
కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కెఐఎడిబి), కర్నాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కెఎస్‌పిసిబి) అధికారులు ఈ బ్యాంకుల్లో అక్రమంగా డబ్బును డిపాజిట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారని, దీనిపై విచారణ జరుగుతోందని ఆర్థికశాఖలోని ఓ సీనియర్ అధికారి ది ఫెడరల్ తో చెప్పారు.
సీబీఐ విచారణకు అవకాశం..
ఈ అంశంపై ఇప్పుడు సీబీఐ విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. నిబంధనల ప్రకారం, జాతీయం చేయబడిన బ్యాంకుల్లో రూ. 1 కోటి మోసం దాటితే ఆ అంశం ఆటోమోటిక్ గా సీబీఐ విచారణకు దారి తీస్తుంది.
ఇది ప్రభుత్వ ఆందోళనను పెంచింది, ఎందుకంటే సిబిఐ విచారణ జరిగితే అది ఎటు నుంచి ఎటూ దారి తీస్తుందో ఇందులో ఇంక ఏ కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయో అని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఇది వారి నియంత్రణకు మించిన పరిణామాలకు దారితీస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల నుంచి దాదాపు రూ. 97 కోట్ల మోసపూరితంగా బదిలీ చేయబడిన వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం బయటపడే అవకాశం ఉంది. కర్నాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కెఐఎడిబి)కి చెందిన రూ.12 కోట్ల ఎఫ్‌డికి సంబంధించిన పిఎన్‌బి కేసులో, కెఎస్‌పిసిబికి చెందిన రూ.10 కోట్ల మోసానికి సంబంధించిన ఎస్‌బిఐ కేసులో, మోసపోయిన డబ్బు ఎక్కడికి పోయిందనే దానిపై ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
దీంతో కేఐఏడీబీ, కేఎస్‌పీసీబీలో వాల్మీకి కార్పొరేషన్‌ తరహాలోనే మరో కుంభకోణం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై బ్యాంకుల దగ్గర లావాదేవీలు నిలిపివేసింది. అలాగే సమగ్ర, అంతర్గత పరిశోధనలు ప్రారంభించింది.
నిధులు ఎలా స్వాహా చేశారు
సెప్టెంబరు 14, 2021న PNB, రాజాజీనగర్ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ. 25 కోట్లు పెట్టుబడి పెట్టిన KIADB, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ముఖ్యమైన కేసులలో ఒకటి. బ్యాంక్ రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులను జారీ చేసింది – ఒకటి దాని సేలం నుంచి రూ. 12 కోట్లు. మరొకటి రూ. 13 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి.
అయితే, మెచ్యూరిటీ తర్వాత రూ. 13 కోట్ల డిపాజిట్ మాత్రమే తిరిగి ఇవ్వబడింది, అయితే బ్యాంకు అధికారుల మోసం కారణంగా రూ. 12 కోట్ల డిపాజిట్ సొమ్ము ఖాతాలో లేకుండా పోయాయి.
అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లో (ప్రస్తుతం ఎస్‌బీఐలో భాగం) కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూ.10 కోట్ల డిపాజిట్‌ను నకిలీ పత్రాలను ఉపయోగించి ఓ ప్రైవేట్ కంపెనీకి రుణం ఇచ్చారు. తరువాత అనేక పత్రాలతో సర్ధుబాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టుల్లో నలుగుతోంది.
SBI- PNBతో అన్ని లావాదేవీలను నిలిపివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక దుష్ప్రవర్తనను అరికట్టడానికి అని ప్రచారం జరిగింది. నిధుల అనధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవడానికి ఆర్థిక శాఖకు ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక అవకతవకలకు బాధ్యులను చేయడం, భవిష్యత్తులో ఇటువంటి పద్ధతులను నిరోధించడంపై దృష్టి సారిస్తుందని శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఆర్థిక అవకతవకలు
ఇది కేవలం ఒక్క సంఘటనే కాదు. 2015లో కర్ణాటక పంచాయతీరాజ్ శాఖ వివిధ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల అక్రమ డిపాజిట్ కు సంబంధించిన భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది.
అప్పటి గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తన శాఖలో ఆర్థిక క్రమశిక్షణారాహిత్యాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత సస్పెండ్‌కు గురైన రామకృష్ణ అనే సీనియర్‌ అధికారి ఆంధ్రాబ్యాంకులోని ఖాతాలో లెక్కల్లో చూపని రూ.134 కోట్ల ప్రభుత్వ నిధులను అక్రమంగా దాచినట్లు దర్యాప్తులో తేలింది.
తదుపరి విచారణ నిమిత్తం కేసును లోకాయుక్తకు అప్పగించారు. విచారణలో మరో రెండు అనధికార ఖాతాలు బయటపడ్డాయి - ఒకటి సిండికేట్ బ్యాంక్‌లో రూ. 66 కోట్లు. మరొకటి కార్పొరేషన్ బ్యాంక్‌లో రూ. 31 కోట్లు అక్రమంగా డిపాజిట్ చేశారని తేలింది.
ఆశ్చర్యపరిచే విషయాలు
ఇదే తరహాలో అనధికార ఫండ్ డిపాజిట్ ఇప్పుడు బయటపడింది. కెఐఎడిబి, కెఎస్‌పిసిబికి సంబంధించిన కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కేసుల్లో బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో అక్రమంగా జమ చేయబడిన పెద్దమొత్తాలు ఉన్నాయి, ఇందులో పాల్గొన్న అధికారులు వ్యక్తిగత లాభం కోసం వీటిని ఉపయోగించుకున్నారు.
ముఖ్యంగా తమిళనాడులోని సేలంలోని PNB బ్రాంచ్‌కి సంబంధించిన కేసు, కర్ణాటకలో నిర్వహించాల్సిన నిధుల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు జారీ చేసింది. కర్ణాటకలో అనేక జాతీయ బ్యాంకులు అందుబాటులో ఉండగా, రాష్ట్రం వెలుపల ఉన్న బ్యాంకు శాఖలో నిధులు ఎందుకు ఉంచారనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు, అనుమానాలను లేవనెత్తింది.
ప్రభుత్వ నిధులను అనధికారికంగా డిపాజిట్ చేయడంపై అంతర్గత విచారణకు ఆదేశించామన్నారు. ఆర్థిక శాఖ సాధారణంగా రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ పద్దులను ఆమోదించబడిన ప్రాజెక్టుల కోసం వివిధ బోర్డులు, కార్పొరేషన్లు, అనుబంధ విభాగాలకు నిధులను పంపిణీ చేస్తుంది.
అయితే, ఈ నిధులను అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించకుండా, కొన్ని బోర్డులు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు వడ్డీ కోసం బ్యాంకుల్లో డబ్బును నిలిపివేసి, తమ ప్రాథమిక లక్ష్యాన్ని విస్మరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వం ఘాటుగా స్పందించింది
ఈ కుంభకోణంపై వేగంగా స్పందించిన ప్రభుత్వం, SBI, PNB నుంచి అన్ని ప్రభుత్వ డిపాజిట్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే ఈ బ్యాంకులలో భవిష్యత్తులో ఎటువంటి డిపాజిట్లను చేయకుండా నిషేధిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అన్ని శాఖలు డిపాజిట్ల ఉపసంహరణ, ఖాతాల మూసివేతపై వివరణాత్మక నివేదికలను సమర్పించాలని ఆర్థిక శాఖ (ఖర్చు మరియు వనరులు) కార్యదర్శి డాక్టర్ పిసి జాఫర్ సెప్టెంబర్ 20, 2024 గడువుతో సర్క్యులర్‌ను జారీ చేశారు.
అధికారులకు సీఎం హెచ్చరిక
ఇటీవలి ఆర్థిక శాఖ సమావేశంలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివిధ బ్యాంకుల్లో నిధుల అక్రమ డిపాజిట్ పై అధికారులను దృష్టికి తీసుకెళ్లారు. ఈ అవకతవకలలో బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివిధ శాఖల పరిధిలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్లు, ఇతర సంస్థల నిధులు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా లేదా ఇతర మార్గాల ద్వారా నిల్వ చేయబడిన కేసుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని కూడా ఆయన సంబంధిత శాఖలను ఆదేశించారు.
Tags:    

Similar News