అయోధ్య రామమందిరానికి పొటెత్తిన భక్తులు

కొత్త సంవత్సరం వేళ కిటకిటలాడిన మందిరాలు;

Update: 2025-01-02 11:45 GMT

కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం టెంపుల్ సిటీ వారణాసి, అయోధ్య ఆలయాలు భక్తులతో కిటకిటలాడినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది అయోధ్య రామమందిరం ప్రారంభమైన తరవాత అత్యధిక సంఖ్యలో భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు.

నిన్న ఒక్కరోజు శ్రీరామచంద్రుడని 2 లక్షల మంది దర్శించున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. మరో మూడు లక్షల మంది ప్రజలు అయోధ్య చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరం తొలిరోజు సూర్యోదయ సమయంలో రామ్ లల్లా మూర్తిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపించారు.

వారణాసి..
ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగం, శక్తి పీఠం కొలువై ఉన్న కాశీలో కూడా కొత్త సంవత్సరం రోజు భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం మూడు గంటల నుంచి గంగానదీలో స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోకడానికి భక్తులు బారులు తీరారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ 3. 5 లక్షల మంది విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
అయోధ్య రామాలయ ట్రస్ట్ అధికారి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు. ఈ రోజు సెలవు దినం కావడంతో ప్రజలంతా ఆలయాలకు పొటెత్తారని అన్నారు. కోర్టులు, పాఠశాలలు, వ్యవసాయ పనులకు విరామం ఇచ్చి మరీ గుడులకు క్యూ కట్టారని అభిప్రాయపడ్డారు.
యాత్రికులకు అయోధ్య ప్రధాన కేంద్రంగా మారిందని, ఇంతకుముందు చాలా మంది గోవా, నైనిటాల్,మనాలీ, సిమ్లా, ముస్సోరి లాంటి ప్రదేశాలకు వెళ్లే వారని, ఇప్పుడు అలాంటి వారి అందరి గమ్యస్థానాన్ని రామ్ లల్లా తీసుకున్నారని చెప్పారు.
జనసందోహాన్ని తట్టుకోవడానికి అయోధ్య నగరాన్ని మల్టిపుల్ సెక్టార్లు, జోన్ లు గా విభజించారు. అలాగే భారీ సంఖ్యలో పోలీసులను సైతం నగరంలో మోహరించారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించారు.
కొత్త సంవత్సరం రేపు ఉందనగానే నగరంలోని అన్ని హోటళ్లలో రూమ్ లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. చాలా చోట్ల ప్రజలు చలిలోనే కారిడార్ లో పడుకుని కనిపించారు. అధికారులు మాట్లాడుతూ దాదాపు 2.5 లక్షల మంది భక్తులు మంగళవారం సాయంత్రానికే రామ్ లల్లాను దర్శించుకున్నారు.
భక్తుల కోసం 10 అదనపు సందర్శకులు గ్యాలరీలు, క్యూ లైన్లు అదనంగా 20 ఏర్పాటు చేశారు. భక్తుల కోసం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. యూపీ పోలీసులు భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా అదనపు బలగాలను మోహరించారు. ఒక్కో మందిరం దగ్గర పది నుంచి 11 మంది పోలీసులను కాపలాగా నియమించినట్లు వెల్లడించారు.
Tags:    

Similar News