ఈడీ, బీజేపీ పొలిటికల్ వింగ్: ఆప్

కేంద్ర దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆప్ ఆరోపించింది. ఎలాంటి తప్పు చేయకపోయినా ఢిల్లీ ముఖ్యమంత్రికి సమన్ల మీద సమన్లు..

Update: 2024-03-19 07:56 GMT

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ సీఎం పై ఈడీ చెబుతున్నవన్నీ కూడా పనికిమాలిన కట్టుకథలని కొట్టిపారేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవితకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, ఆప్ పార్టీకి కవిత వందకోట్ల ముడుపులు చెల్లించారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిని ఆప్ ఖండించింది. దర్యాప్తు సంస్థ పూర్తి పక్షపాతంతో కేసును విచారిస్తోందని ఆరోపించింది.

విషబీజాలను ఈడీ నాటుతోంది: ఆప్ మంత్రి అతిషి
మీడియాలో ఈడీ అనేక కథనాలు వండి వారుస్తోందని, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకూ చూపలేదని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. "కేజ్రీవాల్‌కు సమన్లు మీద సమన్లు పంపడం, తరువాత మీడియాకు ప్రకటనలు జారీ చేయడం చూస్తుంటే దీని వెనక రాజకీయ కక్ష కనిపిస్తోంది
లోక్‌సభ ఎన్నికల ప్రచారం నుంచి కేజ్రీవాల్‌ను ఆపడానికి ED-CBI లు ఒక వ్యూహం ప్రకారం గేమ్ ఆడుతున్నాయి" అని ఆమె విమర్శించారు. కేజ్రీవాల్ సహా మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రతిష్టను అబద్దాలు ప్రచారం చేయడం, మీడియాలో లీక్ లు ఇవ్వడం ద్వారా దెబ్బతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆప్ విమర్శించింది. 500 కు పైగా ప్రాంతాల్ల సోదాలు నిర్వహించి, వేలాది మందిని సాక్షులుగా ఈడీ విచారించిన కేసుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా దర్యాప్తు సంస్థ సంపాదించలేదని ఆక్షేపించింది.
ED ప్రకటన
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు మార్చడం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆప్ అగ్రనేతలైన కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి కుట్రపన్నినట్లు ఈడీ అభియోగం. "దీనికి బదులుగా, ఆమె ఆప్ నాయకులకు రూ. 100 కోట్లు చెల్లించింది" అని ఏజెన్సీ తెలిపింది. అయితే ఆప్ వీటిని ఖండించింది. ఈడీ వాదనను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. " మొత్తం ఎక్సైజ్ కేసు నకిలీదని, సాక్ష్యం లేనిదని ప్రపంచం మొత్తానికి తెలుసు" అని అది పేర్కొంది. బీజేపీ కార్పొరేట్‌లకు చేయూతనిస్తోందని ఆప్ ఆరోపించింది. బీజేపీ అవినీతి అంతా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బయటపడిందని ఆరోపించింది.
Tags:    

Similar News