ఎవరీ టీమ్ వారిదే.. ఎవరీ పోస్టర్ వారిదే: అయోమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్

లోక్ సభ ఎన్నికలు ఓ వైపు సమీపిస్తున్నాయి. మరో ఆరు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు. పార్టీ అగ్రనేత చేస్తున్న యాత్రలు వారిని కలిపి ఉంచలేకపోతున్నాయి.

Update: 2024-01-21 08:22 GMT

తమ పార్టీకీ పేటేంట్ అయినా గ్రూపు తగాదాలు, కుమ్ములాటలతో హస్త వ్యస్తంగా మారింది.

హర్యానా కాంగ్రెస్ లో గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికీ చేరింది. రెండు సార్లు ముఖ్యమంత్రి, జాట్ వర్గ నాయకుడు, మాస్ లీడర్ గా పేరు పొందిన భూపిందర్ హూడా, అతని కుమారుడు దీపిందర్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ ఓ వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. వీరి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రోహ్ తక్ నుంచి ‘ఘర్ ఘర్ కాంగ్రెస్, హర్ ఘర్ కాంగ్రెస్’ను ప్రారంభించారు. అయితే దీనికి మరో గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న వారు హజరుకాకుండా మరునాడు వారి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించుకున్నారు.

టీమ్ ‘ఎస్ఆర్కే’ గా ముద్దుగా పిలుచుకుంటున్న నాయకులైన మాజీ కేంద్ర మంత్రి సెల్జా, రాజ్యసభ సభ్యుడు రణదీప్ సూర్జేవాలా, తోషమ్ కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరీ లు హిసార్ నుంచి వారి సొంతంగా ‘కాంగ్రెస్ సందేశ్ యాత్ర’ను ప్రారంభించారు. ఏఐసీసీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ యాత్ర వద్దని చెప్పినా కూడా వీరు తమ యాత్ర ఆపడానికి నిరాకరించారు.

వాళ్ల ఫొటోలు వాడేదీ లేదు

కాంగ్రెస్ కు చెందిన గ్రూపులు బహిరంగంగా ఇలా ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. వాళ్ల ఉద్దేశం స్పష్టంగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడం అని. అయితే కిందిస్థాయి కార్యకర్తలు మాత్రం అయోమయం లో ఉన్నారు. రెండు గ్రూపులు ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీల్లో కూడా ఎవరీ వర్గం నాయకులు ఫొటోలు వారే వేసుకుంటున్నారు. దీంతో తాము ఏ వర్గంలో చేరాలో తెలియక తికమకపడుతున్నారు.

ఘర్ ఘర్ కాంగ్రెస్ ప్రచార చిత్రాల్లో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హూడా, అతని కుమారుడు రాజ్యసభ సభ్యుడు దీపెందర్ హూడా, సెల్జా స్థానంలో పీసీసీ చీఫ్ గా నియమితుడైన ఉదయ్ భాన్ చిత్రాలతో పాటు పార్టీ అగ్రనాయకత్వం చిత్రాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్ ప్రారంభించిన ‘ఘర్ ఘర్ కాంగ్రెస్’ అధికారిక కార్యక్రమం అని కాంగ్రెస్ నాయకులు మొత్తం ఈ కార్యక్రమం కిందనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ఈ గ్రూపు నాయకత్వం ప్రచారం చేసుకుంటోంది.

ప్రత్యర్థి వర్గంలోని రణదీప్ సూర్జేవాల రాహూల్ గాంధీ కోటరీకి చెందిన వాడు, అలాగే మిగిలిన నాయకులు కూడా గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా ముద్ర పడ్డారు. అయితే వీరు చేసుకుంటున్న ప్రచార పర్వంలో భూపిందర్ హూడా వర్గానికి చోటు దక్కలేదు సరికదా కొన్ని చిత్రాలలో హర్యానా ఏఐసీసీ ఇన్ చార్జ్ బాబారీయా ఫొటో కూడా కనిపించడం లేదు.

"వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారు ఏ వర్గంలో చేరాలో నిర్ణయించుకోలేకపోతున్నారు. రాష్ట కాంగ్రెస్ ఇన్ చార్జీ ఘర్ ఘర్ కాంగ్రెస్ మాత్రమే అధికారిక కార్యక్రమం అంటున్నారు. ఏం చేయాలో నిర్ణయించుకోవడం కష్టంగా ఉంది" అని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్యానా కాంగ్రెస్ బేరర్ ఫెడరల్ తో అన్నారు. మరో కార్యకర్త మాట్లాడుతూ " హూడా మా నాయకుడు. అతను మాస్ లీడర్, ప్రజాదరణ కలిగి ఉన్నాడు. మిగిలిన వాళ్లు కూడా తక్కువ వారేమీ కాదు, వాళ్లకి గాంధీ కుటుంబం అండదండలు ఉన్నాయి. ఒకరిని మరొకరు ఎత్తి చూపడం మానుకుంటే పార్టీకి మంచిది" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం భూపిందర్ హూడా తన కొడుకు రాజ్యసభ ఎంపీ అయిన దీపేందర్ హూడాను రాజకీయంగా ఉన్నతస్థానంలో కూర్చోబెట్టాలని చూస్తున్నాడు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కు ప్రమాదం అనుకున్న నాయకులకు అతను సహకరించడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఎస్ఆర్కే వర్గం వేరుకుంపటి పెట్టి బలప్రదర్శనకు దిగింది. అయితే ఉత్తరాదిలో బలమైన వర్గంగా పేరున్న జాట్ లకు భూపిందర్ హూడా నాయకుడిగా పేరుంది. దాంతో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంది.

హూడా వర్గానికి చెందిన నాయకుడు మాట్లాడుతూ " దీపిందర్ హూడా ను ప్రజలు నాయకుడిగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు. సెల్జా, సూర్జవాలా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపవచ్చు. అయితే వారు మాస్ లీడర్లు కారు. వారు సొంత ఎన్నికల్లో గెలవలేదు, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నామని చెప్పుకుని పార్టీలో కొనసాగుతున్నారు" అని విమర్శించారు.

అయితే హూడా వర్గం ప్రచారాన్ని ఎస్ఆర్కే వర్గం వ్యతిరేకిస్తోంది. హూడా వల్లే సమర్ధులైన వారు పార్టీని వీడి వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు సెల్జా ఫెడరల్ తో మాట్లాడుతూ " హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలని అనుకుంటున్నారు. రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. అందుకే పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సందేశ్ యాత్ర చేపట్టాం" అని చెప్పారు.

మేము సరైన దారిలోనే వెళ్తున్నాం: దీపిందర్ హూడా

తన తండ్రి పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలను దీపిందర్ హూడా కొట్టిపారేశారు. " ఎవరో చెప్పిన వాటిపై నేను వ్యాఖ్యానించుదలచుకోలేదు. ఘర్ ఘర్ కాంగ్రెస్ అనే రాష్ట్ర కాంగ్రెస్ సామూహిక కార్యక్రమం, దీనిని విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చాం, రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తాం" అని ఫెడరల్ తో చెప్పారు.

Tags:    

Similar News