‘‘భారత దాడుల్లో ఐదుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులు మృతి’’

ఆపరేషన్ సింధూర్ లో మరణించిన ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన ప్రభుత్వం;

Update: 2025-05-10 10:52 GMT
ఆపరేషన్ సింధూర్ లోగో

భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిపిన మిస్సైళ్ల దాడులలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లకు చెందిన కనీసం ఐదుగురు తీవ్రవాదులు మరణించినట్లు ఆర్మీ వెల్లడించింది.

వారిలో ఒకరు ఎల్ ఈటీకి చెందిన ముదస్సర్ ఖాదియన్ ఖాన్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబు జుందాల్ అని మురిడ్కేలోని మర్కజ్ తైబాకు ఇన్ ఛార్జీగా ఉన్నాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
వీరి అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాబ్ తరఫున పుష్ఫగుచ్చాలు ఉంచారు. ఆయన అంతక్రియల ప్రార్థన ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
దీనికి అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించారని పేర్కొన్నారు. పాక్ సైన్యంలో పనిచేస్తున్న లెప్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ ఐజీ ప్రార్థన కార్యక్రమానికి హాజరయ్యారు.
జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ అన్నయ్య హఫీజ్ మహ్మద్ జమీల్ కూడా ఈ దాడుల్లో మరణించాడు. దాడుల్లో దెబ్బతిన్న బహవల్పూర్ లోని మర్కజ్ సుభాన్ అల్లాకు అతను ఇన్ చార్జీగా ఉన్నాడు.
యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంలో, జేఎం కోసం నిధుల సేకరణలో అతను చురుకుగా పాల్గొనే వాడని కొన్ని వర్గాలు తెలిపాయి. ఇతనితో పాటు కుటుంబంలోని మరో తొమ్మిది మంది మరణించారు. 
జైషే తో అనుబంధంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే మహ్మద్ యూసుఫ్ అజార్ కూడా ఈ దాడుల్లో చనిపోయాడు. ఇతనికి ఉస్తాద్ జీ, మహ్మద్ సలీం, ఘోసీ సాహబ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. మసూద్ అజార్ బావమరిది ఐసీ-814 హైజాక్ కేసులో ఇతను కీలకపాత్ర పోషించాడు.
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో ఎల్ ఈటీకి చెందిన ఖలీద్ అలియాస్ అబు ఆకాషా, జేఈఎంకు చెందిన మహ్మద్ హసన్ ఖాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు.
ఖలీద్ జమ్మూకాశ్మీర్ లోని అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించేవాడు. ఫైసలాబాద్ లో జరిగిన ఆయన అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హజరైనట్లు తెలిసింది.
ఈ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాదాన్ని పెంచడంలో వాటిని సమన్వయం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ఆర్మీ ధృవీకరించింది.
Tags:    

Similar News