హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మృతి
ఉదయం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలింపు, మార్గమధ్యలోనే విడిచిన తుది శ్వాస
By : The Federal
Update: 2024-12-20 07:46 GMT
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, INLD అధినేత ఓం ప్రకాష్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) గురుగ్రామ్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయన వయస్సు ప్రస్తుతం 89 సంవత్సరాలు. హర్యానాకు 1989 నుంచి 2005 వరకూ ఆయనే వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కొడుకులు అభయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాల క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడు. తండ్రి రాజకీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలోనే చౌతాలా సీఎంగా బాధ్యతల చేపట్టి దిగ్విజయంగా ఐదు సార్లు సీఎంగా హర్యానాను పాలించారు.
ఐఎన్ ఎల్డీ ప్రతినిధి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు ఉదయం చౌతాలా అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చినట్లు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన సాబ్ ను బతికించుకోలేకపోయాము’’ అని మీడియాతో అన్నారు.