‘గాడ్సే’ను అమరుడని కీర్తించిన హిందూ మహాసభ

గాంధీకి ఉన్న జాతిపిత బిరుదును తొలగించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సభ;

Update: 2025-01-30 13:06 GMT

జాతిపిత, మహాత్మాగాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేను అఖిల భారత హిందూ మహాసభ గురువారం సన్మానించింది. పాకిస్తాన్ తో యుద్దం జరుగుతున్న సమయంలో, శత్రుదేశానికి నిధులు ఇచ్చేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి చేశాడని, అలాగే దేశ విభజనకు కూడా ప్రధాన కారణం.. గాంధీనే కారణమని ఆరోపిస్తూ గాడ్సే, గాంధీని స్వాత్రంత్య్రం వచ్చిన ఏడాది లోపే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

గాంధీ రోజువారి కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని బిర్లా హౌజ్ లో ప్రార్థనలకు వస్తుండగా గాడ్సే మూడు రౌండ్ల కాల్పులు జరిపి కాల్చిచంపాడు. చంపిన తరువాత గాడ్సే అక్కడే నిలబడి పోలీసులకు లొంగిపోయారు. విచారణ జరిపిన తరువాత 1949 లో గాడ్సేను ఉరితీశారు.
అమరుడంటూ నినాదాలు..
గాడ్సేను సన్మానించిన సందర్భంగా హిందూ మహాసభ సభ్యులు అతను అమరుడంటూ నినాదాలు చేశారు. ఇక్కడ గాంధీని చంపినందుకు వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
మహాసభ నాయకుడు, నానా ఆప్టేధామ్ వ్యవస్థాపకుడు పండిట్ అశోక్ శర్మ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో హవనపూజ, హానుమాన్ చాలీసా పారాయణం జరిగింది. దేశం నుంచి గాంధీ ఆత్మను తొలగించడం, గాంధీయిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రకటించారు.
మహాత్మగాంధీకి జాతిపిత అనే బిరుదును భారత ప్రభుత్వం రద్దుచేయాలని శర్మ డిమాండ్ చేశారు. గాంధీ హత్యతో సంబంధం ఉన్న నాథురామ్ గాడ్సే, నారాయణ్ నానా ఆప్టే కుటుంబాలను గౌరవించే ప్రణాళికలను కూడా మహాసభ ప్రకటించింది. ఇక్కడ వచ్చిన వారందరికి మిఠాయిలు పంచారు.
Tags:    

Similar News