అరెస్ట్ అయితే 30 రోజుల తరువాత పోస్టు ఊస్టింగే?
కొత్తగా లోక్ సభలో మూడు బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం;
Update: 2025-08-20 11:24 GMT
బీహార్ లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం, తదుపరి పార్లమెంట్ సమావేశాల్లోనూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉన్న మూడు బిల్లును ప్రవేశపెట్టబోతోంది.
ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల చివరి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ బిల్లులో ఉన్న నిబంధనల ప్రకారం.. అరెస్ట్ చేయబడి ఐదు సంవత్సరాల శిక్ష పడే సెక్షన్లు ఉన్న కేంద్ర మంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రులు అరెస్ట్ కాబడి 30 రోజులు జైల్లో ఉంటే వారి పదవి ఆటోమేటిక్ గా పోతుంది. ఇవే ఇందులో ఉండబోతున్నాయి.
బిల్లులను ఆమోదించాలని షా అభ్యర్థన..
నిన్న సాయంత్రం అమిత్ షా లోక్ సభ సెక్రటరీ జనరల్ కు ఒక లేఖ రాశారు. రాజ్యాంగ సవరణ(130) బిల్లు 2025 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ(సవరణ) బిల్లు 2025, జమ్మూకాశ్మీర్ సవరణ బిల్లు 2025 లను మరుసటి రోజు దిగువ సభలో ప్రవేశపెట్టాలని అనుకున్నట్లు తెలిపారు.
తన నిర్ణయం ఆకస్మాత్తుగా రావడం, వర్షాకాల సమావేశాలు ముగుస్తుండటంతో.. ఆలస్యంగా వచ్చిన తన అభ్యర్థన నెరవేర్చడానికి పార్లమెంటరీ నిబంధనలు సడలించాలని కోరారు. ఈ నిబంధనల ప్రకారం.. బిల్లును ప్రవేశపెట్టడానికి మంత్రి ముందస్తు నోటీస్ ఇవ్వాలి.
బిల్లు సభలో ప్రవేశపెట్టే ముందు ఎంపీలకు సర్క్యలేషన్ ను తప్పనిసరి చేసే నియమాన్ని సడలించాలని కూడా షా కోరారు. సభలో ప్రవేశపెట్టిన తరువాత పరిశీలన కోసం ఈ మూడు బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపుతామని ఆయన లోక్ సభ సెకట్రరీకి తెలిపారు.
లోక్ సభలో బుధవారం ప్రభుత్వ వ్యవహారాల జాబితాలో ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు, 2025 తో పాటు మూడు బిల్లులను జాబితా చేయాలని కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ లోక్ సభ సచివాలయానికి తెలిపింది.
గవర్నర్లకు సీఎంలను తొలగించే అధికారం..
ప్రజా జీవితంలో అవినీతి, అక్రమాలను అరికట్టడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న మరో చారిత్రాత్మక చర్యగా దీన్ని కేంద్రం, బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ బిల్లులు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్షకు విధించదగిన నేరానికి సంబంధించినది.
వరసుగా 30 రోజులకు పైగా అరెస్ట్ చేయబడి, నిర్భంధంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రినైనా తొలగించే అధికారం గవర్నర్లు లేదా లెప్టినెంట్ గవర్నర్లకు కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి.
ముఖ్యమంత్రి తొలగింపుకు సూచించిన ప్రక్రియకు విరుద్దంంగా, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతంలో మంత్రిని తొలగించేటప్పుడూ గవర్నర్ లేదా లెప్టినెంట్ గవర్నర్ అనుసరించాల్సిన ప్రక్రియలో ఒక చిన్న తేడాను మాత్రమే బిల్లులు ప్రతిపాదిస్తున్నాయి. అయితే రెండు సందర్భాల్లో వచ్చే ఫలితం మాత్రం ఒక్కటే. అదే సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పదవి కోల్పోవడం.
జైలులో ఉన్న మంత్రిని, ముఖ్యమంత్రి సలహ మేరకు, గవర్నర్ లేదా లెప్టినెంట్ గవర్నర్ సందర్భాన్ని బట్టి పదవి నుంచి తొలగించాలి. తరువాత ముఖ్యమంత్రి గవర్నర్ లేదా లెప్టినెంట్ గవర్నర్ కు అలాంటి సలహ ఇవ్వకపోయినా సంబంధిత మంత్రి ఆ తరువాత రోజు పదవి కోల్పోతారు.
ముఖ్యమంత్రి విషయంలో అరెస్ట్, నిర్భంధం తరువాత 31 వ రోజు లోపు వ్యక్తి తన రాజీనామను సమర్పించాలని అలా చేయలేకపోతే మరుసటి రోజు అతను లేదా ఆమె పదవిని వదులుకోవాలని బిల్లులు ప్రతిపాదిస్తున్నాయి.
ప్రధానమంత్రిని తొలగించే అధికారం రాష్ట్రపతికి అధికారం..
రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతికి కేంద్ర మండలిలోని ప్రధానమంత్రిని లేదా మంత్రిని ఇలాంటి కారణాలతో తొలగించే అధికారాలను కూడా ఇస్తుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధానమంత్రిని లేదా మంత్రిని తొలగించే నిబంధనలు ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ముఖ్యమంత్రులు, మంత్రులకు నిర్దేశించిన వాటికి సమానంగా ఉంటాయి.
అందువల్ల అరెస్ట్, నిర్భంధం తరువాత 31వ రోజుల్లోపు ప్రధానమంత్రి సలహ మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రిని తొలగించవచ్చని ప్రధానమంత్రి అలాంటి సలహ ఇవ్వకపోతే, ఏ సందర్భంలోనైనా 31 రోజుల వ్యవధి ముగిసిన తరువాత రోజు నుంచి మంత్రి కేంద్ర మండలిలో భాగం కావడం ఆగిపోతుందని బిల్లు ప్రతిపాదిస్తుంది.
ప్రధానమంత్రి విషయంలో బిల్లు ప్రకారం.. ఆ వ్యక్తి ‘‘అరెస్ట్, నిర్భంధం తరువాత ముప్పై ఒకటవ రోజులోపు తన రాజీనామాను సమర్పించాలి. అతను రాజీనామా చేయకపోతే ఆ తరువాత వచ్చే రోజు నుంచి అతను ప్రధానమంత్రిగా ఉండటం కుదరదు’’
ప్రతిపక్షాల అభ్యంతరం ఏంటీ?
ప్రధానమంత్రి, కేంద్రమంత్రి మండలి సభ్యులను చేర్చడం అనేది, రాజకీయ పటంలోని కళంకిత రాజకీయ నాయకులతో వ్యవహరించేటప్పుడూ నిజంగా సమానంగా ఉండేలా ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రం తీసుకువస్తున్నట్లు అనిపించవచ్చు. అయితే ప్రతిపక్షం దీనికి అంగీకరించడం లేదు.
‘‘గత 11 సంవత్సరాలుగా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్క కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రిని ఏదైనా దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం చూశారా? సమాధానం దొరకదు. మరో వైపు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో చూడండి. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
అర్వింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, పి. చిదంబరం, డికే శివకుమార్, హేమంత్ సోరెన్ లను వివిధ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసి వారిపై ఎటువంటి కేసు రాకుండా నెలల తరబడి జైలులో ఉంచిన ప్రతిపక్ష నాయకులు నెలల తరబడి విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదిత చట్టాలు పార్టీ శ్రేణులకు అతీతంగా రాజకీయా నాయకులకు ఒకే విధంగా వర్తింపజేస్తారని మీరు అనుకుంటున్నారా? ’’ అని రాజ్యసభ లో కాంగ్రెస్ ఉప నాయకుడు ప్రమోద్ తివారీ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
‘‘ఎంతటి దుర్మార్గాపు వలయం. అరెస్ట్ కు ఎటువంటి మార్గదర్శకాలు పాటించలేదు. ప్రతిపక్షనాయకుల అరెస్ట్ లు అసమానంగా ఉన్నాయి. కొత్త ప్రతిపాదిత చట్టం అరెస్ట్ అయినా వెంటనే ప్రస్తుత ముఖ్యమంత్రిని తొలగిస్తుంది.
ప్రతిపక్షాన్ని అస్థిరపరచడానికి ఉత్తమ మార్గం ప్రతిపక్ష సీఎంలను అరెస్ట్ చేయడానికి పక్షపాత కేంద్ర సంస్థలను విడుదల చేయడం ఎన్నికలలో వారిని ఓడించలేకపోయినా, ఏకపక్ష అరెస్ట్ ల ద్వారా వారిని తొలగించడం. అధికార పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రిని ఎవరూ ఎప్పుడు ముట్టుకోలేదు’’ అని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా ఎక్స్ లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. ‘‘239 మంది సభ్యులున్నా మోదీ సంకీర్ణం పార్లమెంట్ ను అపహస్యం చేయడానికి, అంతరాయం కలిగించడానికి మరిన్ని మార్గాలను వెతకడానికి ఇంకా విన్యాసాలు చేస్తున్నారు’’ అని విమర్శించారు.
పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టిన తరువాత తమ పార్టీ అధికారికంగా వాటిపై వ్యాఖ్యానిస్తుందని పేర్కొంటూ సీపీఎం ఎంపీ ఒకరు ది ఫెడరల్ తో మాట్లాడారు. ప్రధానమంత్రి లేదా కేంద్రమంత్రిని తొలగించడానికి ఇలాంటి నిబంధనలను చేర్చడం ప్రతిపక్ష నాయకులు వేధించడం, ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలను అస్థిరపరచడం లేదా కూల్చివేసే ఏకైక ఉద్దేశ్యంతో ఉన్న చట్టాలను చట్టబద్దం చేయడానికి ఒక ముసుగు మాత్రమే’’ అని అన్నారు.
‘‘గత దశాబ్దంలో మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా రాజీ చేసిందో, ప్రతిపక్ష నాయకులను ఎలా వెంటాడాల్సి వచ్చిందో మనమందరం చూశాము. ప్రతిపక్ష నాయకుడి అభ్యంతరాలు లేదా అసమ్మతి ఉన్నప్పటికీ వారు ఎంపిక చేసిన వ్యక్తులు దర్యాప్తు సంస్థలను నడిపిస్తున్నారు.
ఈ దర్యాప్తు సంస్థలను ప్రధానమంత్రి లేదా అతని ప్రభుత్వంలోని ఏ సభ్యుడిని అయినా అరెస్ట్ చేస్తామని అరెస్ట్ చేస్తాయని మనం ఎలా ఆశిస్తాం. 2014 నుంచి అనేక మంది బీజేపీ ఎంపీలు, మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక్క అరెస్ట్ కూడా జరగడం మీరు చూశారా?
ఒక ఎంపీ మన మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని, ఒక కేంద్రమంత్రి యూపీలో నిరసన తెలుపుతున్న రైతులను ఢీ కొట్టి చంపిన తన కొడుకును రక్షించాడని ఆరోపణలు వచ్చాయి. వారిలో ఎవరినైనా అరెస్ట్ చేశారా? ’’ అని సీపీఎం ఎంపీ అడిగారు.
మోదీ జీరో టాలరెన్స్..
ప్రజా జీవితంలో జరిగే అక్రమాలు, అవినీతి, దుష్త్రవర్తన పట్ల మోదీ ఎలాంటి సహనం చూపించడం లేదని ఈ బిల్లులు చూపిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి లేదా మంత్రిని సుదీర్ఘకాలం జైలులో ఉంచిన పరిస్థితికి ప్రస్తుత చట్టాలు ఎటువంటి పరిష్కారాన్ని అందించనందున, ఆ బిల్లులను జాతీయ ప్రయోజనాల కోసం తీసుకువస్తున్నట్లు ఒక సీనియర్ కేంద్ర మంత్రి ది ఫెడరల్ తో చెప్పారు. ఇవి ప్రభావవంతమైన పాలనకు, న్యాయపరమైన దర్యాప్తుకు కూడా ప్రత్యక్షంగా ఆటంకం కలిగిస్తుంది.
లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయినప్పుడు అర్వింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఆరు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచి పనిచేయాల్సి వచ్చింది. తమిళనాడుకు చెందిన మంత్రి సెంథిల్ బాలాజీ ఇలాగే ఉన్నారు. ఆయన ఎంకే స్టాలిన్ అరెస్ట్ అయిన తరువాత కూడా పదవి నుంచి తొలగించలేదు. ప్రజాస్వామ్యంలో అలాంటి పరిస్థితి అనుమతించబడాలా? అని కేంద్రమంత్రి ఒకరు అన్నారు. అమిత్ షా లోక్ సభలో ఈ చట్టాలను ప్రవేశపెట్టినప్పుడూ వాటి అవసరాన్ని వివరిస్తారని అన్నారు.