వచ్చే 24 గంటల్లో భారత్ మాపై దాడి చేయబోతోంది: పాకిస్తాన్
గజగజ వణుకుతున్న ఇస్లామాబాద్, దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-30 04:30 GMT
పహల్గామ్ ఉగ్రవాద ఘటనపై భారత్ సైనిక చర్యకు సిద్దమవుతున్నట్లు పాకిస్తాన్ గజగజ వణుకుతోంది. ఆ దేశ మంత్రి స్వయంగా ఈ ప్రకటన చేశారు. వచ్చే 26 నుంచి 48 గంటల్లోనే న్యూఢిల్లీ భారీ సైనిక చర్యకు దిగబోతున్నట్లు మాకు కచ్చితమైన సమాచారం ఉందని మీడియా ముందుకు వచ్చిమరీ చెప్పారు.
తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించబోతున్నామని మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేశారు. ఆ దేశం భయపడినట్లుగానే నిన్న మొత్తం ఢిల్లీ లో కీలక పరిణామాలు జరిగాయి.
పహల్గామ్ ఉగ్ర ఘటనపై భారత్ స్పందించే విధానం, లక్ష్యాలు, సమాయాన్ని నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలకే అప్పగిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హజరైన ఉన్నత స్థాయి సమావేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయడం జాతీయ సంకల్పమని మోదీ ధృవీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
‘‘మా ప్రతిస్పందన విధానం, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించడానికి వారికి పూర్తి కార్యచరణ స్వేచ్ఛ ఉంది’’ అని మోదీ చెప్పినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ దాడి వెనక ఉన్న ఉగ్రవాదులు, వారి పోషకులను వేటాడి, దేశంలోని ఉగ్రవాద దాడులకు ప్రొత్సహించిన చరిత్ర కలిగిన పాకిస్తాన్ ను దిక్కుల చివరి వరకూ వెంటాడి వారి ఊహకు అందని కఠినమైన శిక్ష విధిస్తామని మోదీ ప్రతిజ్ఙ చేశారు.
కాల్పుల విరమణ ఉల్లంఘన..
పాకిస్తాన్ దళాలు వరుసుగా ఆరో రోజు రాత్రి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని నాలుగు సరిహద్దు జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడితో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బహుళ సెక్టార్లలో కాల్పులు జరిపాయని, దీనితో భారత దళాలు సమర్థవంతంగా స్పందించాయని అని అధికారులు తెలిపారు. చిన్న ఆయుధాలతో ప్రారంభమైన కాల్పులు, జమ్మూ జిల్లాలోని ఐబీ వెంట ఉన్న పర్గ్వాల్ సెక్టార్ నుంచి రాజౌరీ జిల్లాలోని సుందర్ బానీ, నౌషఏరా సెక్టార్ల నుంచి ఏప్రిల్ 29-30 మధ్య రాత్రి నివేదికలు వచ్చాయి.
తీవ్ర పరిణామాలు ఉంటాయి: పాక్
రాబోయే కొన్ని గంటల్లో భారత్, పాకిస్తాన్ పై దాడికి దిగేందుకు సిద్దంగా ఉందని, అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ప్రధాని అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు, సైన్యానికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉందని వార్తలు వెలువడగానే ఇస్లామాబాద్ స్పందించింది.
ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందనే ‘‘నిరాధారమైన, కల్పిత ఆరోపణల’’ ఆధారంగా భారత ప్రభుత్వం దాడి చేయడానికి సిద్దమవుతోందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ అన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద బాధితురాలిగా ఉందని, దాన్ని అన్ని రూపాల్లో, వక్తీకరణలలో దానిని ఎల్లప్పుడూ ఖండిస్తునే ఉందని మంత్రి అన్నారు. ఇస్లామాబాద్ నిపుణల తటస్థ కమిషన్ ద్వారా విశ్వసనీయమైన, పారదర్శకమైన, స్వతంత్య్ర దర్యాప్తును అందించిందని, భారత్ దర్యాప్తును తప్పించుకుంటుందని, ఘర్షణ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు.
అష్టదిగ్భంధనం చేస్తున్న భారత్..
భారత్ పహల్గామ్ ఉగ్ర ఘటనపై తీవ్రంగా స్పందించింది. కేవలం హిందు పర్యాటకులే లక్ష్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిగి 26 మందిని కాల్చి చంపడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
ఈ ఘటనపై భారత్ వెంటనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించేసింది. పాక్ జాతీయులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
అలాగే ఇస్లామాబాద్ దిగుమతి చేసుకుంటున్న ఫార్మా దిగుమతులను సైతం అన్ని మార్గాల నుంచి నిలిపివేయాలని సైతం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.