ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లేదని మోదీ తనకు హమీ ఇచ్చారన్నా అమెరికా అధ్యక్షుడు
By : The Federal
Update: 2025-10-16 07:34 GMT
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందనే ట్రంప్ ప్రకటనపై న్యూఢిల్లీ స్పందించింది. అస్థిర పరిస్థితులలో భారత వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడానికి స్థిరంగా ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
‘‘భారత్ చమురు, గ్యాస్ ను దిగుమతి చేసుకునే దేశాలలో ప్రధానమైనది. అస్థిర ఇంధన పరిస్థితులలో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం మా స్థిరమైన ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యంతోనే ఉన్నాయి’’ అని జైస్వాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్థిరమైన ఇంధన విధానం..
‘‘స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరా గొలుసులు మా ఇంధన విధానం ప్రధాన లక్ష్యాలు. ఇందులో మార్కెట్ పరిస్థితులను వైవిధ్యపరచడం కోసం విస్తృతంగా సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని ప్రకటన విదేశాంగ శాఖ తెలిపింది.
ఇంధన కొనుగోళ్ల విషయంపై అమెరికాతో చాలా సంవత్సరాలుగా చర్చలు జరపుతున్న విషయాన్ని కూడా ఆయన ధృవీకరించారు. అయితే రష్యా చమురు కొనుగోళ్ల విషయం పై అమెరికా అధ్యక్షుడికి మోదీ హమీ ఇచ్చారనే అంశాన్ని విదేశాంగ శాఖ ఎక్కడా ప్రస్తావించలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ఇక ముందు చమురు కొనుగోలు చేయబోదని అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తనకు స్పష్టమైన హమీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ విమర్శలు..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదనే ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడుతున్నారని విమర్శించారు.
‘‘భారత్ రష్యా చమురు కొనుగోలు చేయద్దని నిర్ణయించుకోవడానికి అమెరికా అధ్యక్షుడి అనుమతి కోరారు. మోదీ ట్రంప్ కు భయపడుతున్నారని రాహుల్ తన పోస్ట్ లో ఆరోపించారు. పదేపదే తిరస్కణలకు గురవుతున్న ప్రధాని మోదీ ట్రంప్ కు సందేశాలు పంపుతూనే ఉన్నారని ఆయన అన్నారు.
రష్యా తో చైనా తరువాత భారత్ ఎక్కువ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోంది. క్రిమ్లిన్ తో వాణిజ్య సంబంధాలు తెంపుకోవాలని భారత్ పై వైట్ హౌజ్ ఒత్తిడి చేస్తోంది.
దీనిని భారత్ అంగీకరించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇందులో రష్యన్ చమురు కొనుగోలు కారణంగా అదనపు 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి.