మాయావతి నిర్ణయం పార్టీనే కనుమరుగు చేసే ప్రమాదం ఉందా?
ఆకాశ్ ఆనంద్ ను రెండోసారి తొలగింపు దళిత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?;
Update: 2025-03-03 08:37 GMT
బీఎస్పీ.. ఉత్తర ప్రదేశ్ లో ఒకప్పుడు తిరుగులేని పార్టీ, కానీ గత మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి అది అస్థిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా పార్టీ అధినేత మాయావతి తన మేనల్లుడిని మరోసారి పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించడంతో పార్టీ పేరు మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.
నిజానికి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ఆకాశ్ ఆనంద్ ను తిరిగి పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. చాలామంది ఇది పార్టీ తన నిర్ణయాలను పున: సమీక్షించుకుందని భావించారు.
కానీ తాజాగా మరోసారి తన మేనల్లుడిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో పార్టీలో కలకలం రేగింది. ఇది నిజంగా పార్టీకి ఆత్మహత్యా సదృశ్యంగా మారుతుందని చాలామంది విశ్లేషకులు చెబుతున్న మాట.
మంచి వక్తగా పేరుంది..
ఆకాశ్ ఆనంద్ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీని ‘‘తీవ్రవాదుల పార్టీ’’ అంటూ నోరు పారేసుకుకోవడంతో వెంటనే అతడిని పార్టీ పదవుల నుంచి మాయావతి తొలగించారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత తిరిగి మరోసారి అతడికి పార్టీ పదవులను అప్పగించారు.
ఆకాశ్ ఆనంద్ 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు. లండన్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. తన ప్రసంగాలతో మంచి వక్తగానే పేరు తెచ్చుకున్నాడు. బీఎస్పీ ఎదుర్కొనే నాయకత్వ సంక్షోభాన్ని ఆయనకు పూరించే సత్తా ఉందనే అనిపిస్తుంది.
కాకపోతే తనకు కుటుంబానికి రాజకీయం అనుభవం లేవు. ప్రస్తుతం మాయవతి రాజకీయాల్లో అంతగా క్రియాశీలకంగా ఉండట్లేదు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడంలో విఫలమవుతూనే ఉన్నారు.
మాయవతి నిర్ణయాన్ని సమర్థించని దళితులు
ఎన్నికల్లో బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఆకాశ్ ఆనంద్ పై మాయావతి తీసుకున్న నిర్ణయాన్ని దళితులు, ముఖ్యంగా మాజీ సీఎం సొంత కమ్యూనిటీ అయిన జాతవాలు కూడా హర్షించడం లేదు. అందుకే వారు రాజ్యాంగాన్ని రక్షించడానికి సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ను ఆశ్రయించారు.
బీఎస్పీ ఉనికికే సవాల్ విసిరే మరో పరిణామం కూడా ఇక్కడ చోటు చేసుకుంది. అదే ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఎన్నికల్లో పోటీ చేసి నగీనా స్థానం నుంచి గెలిచారు.
ఇప్పుడు అతను దళిత నాయకుడిగా ఎమర్జ్ అయితే పార్టీకి ప్రమాదం. యూపీలో దాదాపు 20 శాతంగా ఉన్న దళితులు అతడు నాయకుడిగా మారితే కాన్షీరామ్ స్థాపించిన పార్టీ కనుమరుగు కాక తప్పదు.
కానీ ఎన్నికల తరువాత బీఎస్పీ మరోసారి ఆకాశ్ ను పార్టీ పదవులను అప్పగించింది. ఆయన కూడా అగ్రేసివ్ గా బీజేపీని, దాని హిందూత్వ సిద్దాంతాలే లక్ష్యంగా విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
తనకు ప్రత్యామ్నాయ నాయకుడు గల చంద్రశేఖర్ ఆజాద్ వైపు యువత ఆకర్షితుడు కాకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం బీఎస్పీ తన పార్టీ సిద్దాంతాలను యువతరానికి చేరువయ్యేలా చేయాలి. అందుకోసం కొత్త నాయకత్వం అవసరం. ఆ పనే ఆకాశ్ చేయడం ప్రారంభించాడు. కానీ రెండోసారి పార్టీ పదవులు వచ్చాక దూకుడు బాగా తగ్గింది.
బీజేపీకి ఏం లాభం..
బీఎస్పీకి తిరిగి వచ్చిన తరువాత ఆకాశ్ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించి ప్రచారం చేశారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఇంతకాలం మమ్మల్ని ప్రశ్నించి, ఎగతాళి చేసిన దళిత నాయకుడు ఇప్పుడు సైడ్ లైన్ కావడం పార్టీకి ఆనందం కలిగించే విషయం.
కొన్ని సోర్సుల ప్రకారం.. ఆకాశ్ ఆనంద్ తన గొంతును బలవంతంగా తగ్గించడానికి కారణం మాత్రం మాయావతినే అంట. మాయావతి సీఎంగా ఉన్న సమయంలో చేసిన అనేక స్కామ్ లకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారట.
‘‘ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆకాశ్ ఆనంద్ పార్టీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఎక్కడ కూడా ఉత్తేజితంగా, తనదైన శైలిలో ప్రసంగం చేయలేకపోయాడు. దీని వెనక మాయావతి ఉంది’’ అని మాజీ ఎంపీ ఒకరు ‘ ది ఫెడరల్ ’ తో అన్నారు.
ఆకాశ్ పై మాయావతి ఎందుకు ఆగ్రహంగా ఉంది..
ఆకాశ్ ను తొలగించే సమయంలో మాయవతి కొన్ని కారణాలను వెల్లడించారు. ‘‘ తన అపరిపక్వ రాజకీయతను ఆయన పదే పదే వెలువరిస్తున్నారు.’’అందుకే తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. కేవలం ఐదు సంవత్సరాల క్రితం రాజకీయాలు ప్రారంభించి పార్టీ సంస్థాగత లక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని కూడా ఆమె ఆరోపించారు.
ఆకాశ్ పై చేసిన విమర్శలల్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా మాజీ సీఎం ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనది మాజీ ఎంపీ తన మామ అశోక్ సిద్దార్థ్ చెప్పినట్లు ఆడుతున్నాడని, పార్టీని రెండు చీల్చే లక్ష్యంతో ఉన్నాడని విమర్శించారు. అశోక్ సిద్దార్థ్ ను కొన్ని వారాల క్రితమే మాయవతి పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు.
ఇక నుంచి తన పార్టీకి తాను మరణించే వరకూ కొత్త నాయకుడిని నియమించేది లేదని కూడా మాయావతి తేల్చేశారు. ఆకాశ్ ను తొలగించిన తరువాత పార్టీ సమన్వయ కర్తగా ఆనంద్ కుమార్ ను, రామ్ జీ గౌతమ్ ను నియమించారు. ఆనంద్ కుమార్ స్వయంగా ఆకాశ్ కు తండ్రి.
వీరికి కేటాయించిన బాధ్యతలు ఏంటో తెలుసా?
ఆనంద్ కుమార్ ఇప్పటికే పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయనకు ఢిల్లీలో ఉంటూ ముఖ్యమైన పత్రాల నిర్వహణ, ఇతర పార్టీ కార్యకలాపాలను చూసుకోవాలి. రామ్ జీ గౌతమ్ చేయాల్సిన పనుల విషయంలో కూడా స్పష్టత ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే.. ఇక ముందు తన కుటుంబంలోని కుమారులు రాజకీయ నాయకుల కుమార్తెలను వివాహం చేసుకోరని కూడా మాయావతి ప్రకటించారు.
ప్రస్తుతానికి గౌతమ్ మిగిలిన రాష్ట్రాలలో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటారు. పార్టీ బలోపేతం చేయాల్సిన అన్ని నిర్ణయాలను ఆయనకు అప్పగించారు. అలాగే రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సిద్దం చేయడానికి మాయావతి ఆధ్వర్యంలో పనిచేస్తారు.
ఆత్మహత్య సదృశ్యమేనా?
అనేక రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా బీఎస్పీ రాజకీయాలను చాలా సంవత్సరాలు పరిశీలిస్తున్న అనేక మంది విశ్లేషకులు మాయావతి ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతున్నారు. ఇది ఆకాశ్ రాజకీయ కెరీర్ ను అంతం చేయడమే కాదు.. బీఎస్పీ భవిష్యత్ ను అంతం చేయడమే అని చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ దళిత కార్యకర్త, రాజకీయ వ్యాఖ్యాత ఫ్రొపెసర్ రవికాంత్ ఈ విషయంపై తన అభిప్రాయాలను ‘ ది ఫెడరల్ ’ తో పంచుకున్నారు. ‘‘కాన్షీరామ్ చాలాకాలం పాటు కష్టపడి నిర్మించిన దళిత ఉద్యమానికి బెహాన్ జీ ఆత్మహత్య దెబ్బతగిలింది’’ అని అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ లోని దళిత యువకులు ఆకాశ్ తొలగింపుపై ఆగ్రహంగా ఉన్నారు. వారు ప్రతిభగల కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. తమ కోసం మాయవతి పోరాటం లేదని భావిస్తున్నారు. అదే సమయంలో ఆకాశ్ రావడంతో వారికి విశ్వాసం కలిగింది.
కానీ బీజేపీ పై విమర్శలు చేశారనే నెపంతో పార్టీ నుంచి తొలగించారు. ఇది పార్టీకి ఎన్నికల్లో చెడ్డపేరు తెచ్చింది. తరువాత మరోసారి ఆకాశ్ ను పార్టీలోకి తీసుకున్నారు. చాలామంది ఆమె మద్దతుదారులు ఇది తప్పును సరిదిద్దుకోవడంగా భావించారు.
కానీ రెండో సారి కూడా ఆకాశ్ ను పార్టీ తొలగించారు. ఇప్పుడు పార్టీ ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం తో ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
తిరిగి ప్రజల్లోకి రావాలి..
రవికాంత్ అభిప్రాయాలతో ‘జన్ మోర్చా’ ఎడిటర్ సుమన్ గుప్తా ఏకీభవించారు. ఇప్పుడు బీఎస్పీ తన ప్రాభావాన్ని తిరిగి పొందాలంటే ఏకైక మార్గం దళిత సమస్యలను లేవనెత్తి పోరాడాలని సూచించారు. 1980-90 లలో ఇలాగే పార్టీ ప్రజలకు చేరువైందని ఇదే పంథాను మరోసారి అనుసరించాలని అన్నారు.
అయితే ఇప్పుడు ఆనంద్ కుమార్ కు పార్టీ కార్యాలయ నిర్వహణ అప్పగించడం, రామ్ జీ గౌతమ్ కు దేశవ్యాప్త కార్యకలాపాలను ఇవ్వడం వంటివి చూస్తే మాయావతి నిర్ణయాలపై ఆయన ఓ అంచనా వచ్చారు.
కేవలం వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతికే ఆమె ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనికారణంగా అసెంబ్లీలో పార్టీకి కేవలం ఒకస్థానం దక్కిందని, అలాగే పార్లమెంట్ ఒక్క సీట్ కూడా రాలేదని అన్నారు. ఇప్పుడు దాని ఓటు బ్యాంకు కూడా జారిపోతుందని విశ్లేషించారు.
మాయావతికి సన్నిహితంగా ఉన్న మరో మాజీ ఎంపీ ‘ ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పార్టీ ఉన్న ముఖ్య నాయకులందరిని బెహన్ జీ వెళ్లగొట్టారని చెప్పారు. 2019 తరువాత పార్టీ లో చేరిన ఏకైక నేత కేవలం ఆకాశ్ ఆనంద్ మాత్రమే అని, కానీ ఆయనకు ఇంత అవమానం జరిగిన తరువాత పార్టీ లో ఉంటాడా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అయితే దళిత ఉద్యమాలకు కొత్త గమ్యాన్ని నిర్దేశించగల సత్తా ఆకాశ్ కు ఉందన్నారు. ఇక్కడ తనకు సరైన గుర్తింపు లేకపోతే కొత్త వేదిక ఎంచుకోవాలన్నారు.