వెళ్లి మోదీకి చెప్పుకోమన్న ఇస్లామిక్ ఉగ్రవాదులు
తన భర్తను చంపినందుకు ఎదురుతిరిగిన మహిళ, వెకిలిగా సమాధానం ఇచ్చిన జిహాద్ మూక;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-23 05:44 GMT
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఇస్లామిక్ జిహాద్ మూకలు మారణకాండ జరిపారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు చాలా భయానకంగా ఉన్నాయి.
కేవలం ముస్లిం మతానికి చెందలేదు అన్న ఏకైక కారణంతో హిందువులతో సహ ఇతర మతాలవారిని కాల్చి చంపారు. ఈ భయాన అనుభవాన్ని ప్రత్యక్ష సాక్షి పల్లవి మీడియా ముందు భోరున విలపిస్తూ చెప్పారు.
తన భర్త మంజునాథ్ ను ముస్లిం కాదని, సుర్మా చదవాలని బలవంతం చేసి నిరాకరించడంతో పాయింట్ బ్లాక్ రేంజ్ లో తుఫాకీతో కాల్చి చంపారని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలంటూ పైశాచిక నవ్వులు నవ్వారని చెప్పారు. తన భర్తతో పాటు తనను, తన 18 ఏళ్ల కుమారుడిని చంపాలని వేడుకున్నామని పల్లవి జాతీయ మీడియా ముందు చెప్పారు.
నన్ను కూడ చంపండి..
కన్నడ మీడియాతో ఫోన్ లో మాట్లాడిన పల్లవి.. ‘‘మేము పహల్గామ్ లో ఉన్నాము. నా భర్త నా ముందే చనిపోయాడు. నేను ఏడవలేకపోయాను, కనీసం స్పందించలేకపోయాను. నాకు ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు’’ అని అన్నారు.
ముగ్గురు నలుగురు దాడి చేసే వ్యక్తులు ఉన్నారని చెప్పారు. తన భర్త మరణించిన తరువాత ఆమె ఒక ఉగ్రవాదిని ఎదుర్కొంది. ‘‘మేరే పతి కో మారా హై న, ముఝే భీ మారో’’(నువ్వు నా భర్తను చంపావు, నన్ను కూడా చంపు)అని చెప్పింది. ఆమె కొడుకు కూడా అతనిని ఎదుర్కొని ‘‘కుట్టే మేరే పాపాకో మారా, హుమేన్ భీ మార్ దాలో ( నువ్వు ఒక కుక్కవి, నువ్వు నా తండ్రిని చంపావు, మమ్మల్ని కూడా చంపు) అని అన్నాడు.
దానికి ఉగ్రవాదులు బదులిస్తూ ‘‘నహిన్ మరేంగే, తుమ్ మోదీ కో జాకే బోలో’’(నిన్ను చంపను, వెళ్లిమోదీకి చెప్పుకో) అని ఆ ఉగ్రవాది వెకిలీగా నవ్వాడని పల్లవి చెప్పింది.
కేవలం హిందువులే లక్ష్యం..
ఆమె క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు కేవలం హిందువులే లక్ష్యంగా చేసుకున్నారని చెప్పాడు. వారి మరో ముగ్గురు ఉగ్రవాదులు సాయం చేశారని పేర్కొన్నాడు. వారంతా బిస్మిల్లాహ్ అని అంటూ సురక్షితమైన ప్రదేశానికి పారిపోయారని అన్నారు.
కొంతమంది ప్రత్యక్ష సాక్షులు సైనిక దుస్తులతో ఉగ్రవాదులు రాలేదని చెప్పగా, మరికొంతమంది ఆర్మీ యూనిఫాంలో ఉన్నారని చెప్పారు. హిందువుల పర్యాటకులలో కేవలం పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఖురాన్ లోని కొన్ని సూక్తులు చదవమని బెదిరిస్తూ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందారు.
ఈ ప్రదేశంలో దాదాపు 500 మంది ఉన్నారని చెప్పారు. చనిపోయిన హిందువుల బట్టలు విప్పించారని, ముస్లింలు, హిందువులు అని గుర్తించి చంపారని కొన్ని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
సెలవు దినం పీడకలా మారింది..
కర్ణాటకకు చెందిన మంజునాథ రావు వ్యాపారవేత్త. సెలవులు గడపడానికి వారు ముగ్గురు గుర్రాలపై పహాల్గాం వెళ్లారు. కుమారుడు ఉదయం నుంచి ఏమి తినకపోవడంతో ఆమె భర్త అతనికి బ్రెడ్ తీసుకురావడానికి బయటకు వెళ్లారు. వారికి కాల్పుల శబ్ధాలు సైన్యానికి చెందినవని అనుకున్నారు.
జనం అప్పటికే పరిగెత్తడం ప్రారంభించాడు. తాము వెళ్లి చూసే సరికే పల్లవి భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని తలపై కాల్పులు జరిపారు. నేను నా భర్త దేహం పక్కనే కూర్చున్నాను. కానీ స్పందించలేకపోయానని అన్నారు.
బ్యాంక్ మేనేజర్ అయిన పల్లవి తన భర్త మృతదేహంతో మాత్రమే తన స్వస్థలమైన శివమొగ్గకు తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పారు. అధికారులు సాయం చేయాలని వేడుకుంది.
ఏప్రిల్ 19 జమ్మూకాశ్మీర్ కు వెళ్లి, ఏప్రిల్ 24న తిరిగి రావాలని షెడ్యూల్ వేసుకున్నారు. కానీ ఈ విషయం తెలియడంతో శివమొగ్గలో విషాదవాతావరణం నెలకొంది. కొడుకు మంజునాథ రావు మృతి చెందిన విషయం ఆయన తల్లికి ఇంకా తెలియపరచలేదు.