వామ్మో.. ఎంత డబ్బు.. అది కూడా పని మనిషి ఇంట్లో..
జార్ఖండ్ రాజధాని రాంఛీలోని ఓ ఇంటిపై ఈడీ దాడులు చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నోట్ల కట్టలు లభించిన వ్యక్తికి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి సంబంధం ఉన్నట్లు..
జార్ఖండ్ లోని ఓ ఇంటి నుంచి కొంతమంది అధికారులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమంలో వైరల్ అవతున్న ఫొటో రాంఛీలోని గడిఖానా చౌక్ లోని ఓ బిల్డింగ్ దని తేలింది. ఇలా కరెన్సీ నోట్లను బయటకు తీస్తున్న వారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులని తెలుస్తోంది. డబ్బులు దొరికిన వ్యక్తికి జార్ఖండ్ రూరల్ డెవలప్ మెంట్ మంత్రి, అలంగీర్ ఆలం కార్యదర్శితో సంబంధం ఉన్నట్లు తేలింది. వాళ్ల ఇంటి పనిమనిషి ఇంటిపై ఈడీ దాడులు చేసినప్పుడు ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి.
Jharkhand: Enforcement Directorate (ED) is conducting raids at multiple locations in Ranchi. A significant amount of cash has been recovered from household help of Sanjiv Lal - PS to Jharkhand Rural Development minister Alamgir Alam, in connection with the Virendra Ram case. pic.twitter.com/zPKFk1yS0F
— IANS (@ians_india) May 6, 2024