కుంభమేళా: విమాన చార్జీలు విపరీతంగా పెరగడంపై వీహెచ్పీ ఆగ్రహం

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వినతి;

Update: 2025-01-27 11:15 GMT

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు స్వదేశీ, విదేశీ భక్తులు కోట్ల సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే భక్తుల విశ్వాసాన్ని కొన్ని విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుని టికెట్ల రేట్లు ఏకంగా 600 శాతం పెంచడంపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రయాగ్ రాజ్ నుంచి చాలా నగరాలకు సాధారణ రోజుల్లో విమాన టికెట్ ధర సగటున రూ. 5 వేలుగా ఉండేది. అయితే ఈ ఉత్సవం ప్రారంభమైన తరువాత ప్రస్తుతం 21 వేలుగా ఉంది. దీనిపై వీహెచ్ పీ నిరసనలకు దిగింది. వెంటనే ప్రభుత్వం  జోక్యం చేసుకోవాలని కోరింది.

ఇంకా పెరుగుతూనే ఉన్న ధరలు..
ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్ కు టికెట్ల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ముంబై నుంచి ప్రయాగ్ రాజ్ కు ఇప్పుడూ రూ. 22 వేలుగా ఉండగా, కొన్ని సంస్థలు రాను పోనూ రూ. 60 వేలుగా చార్జ్ చేస్తున్నాయి. అలాగే బెంగళూర్ నుంచి వన్ వే టిక్కెట్ ధర రూ. 26 వేలు నుంచి 48 వరకూ ఉన్నాయి.
డీజీసీఏ .. వీహెచ్ పీ
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాగ్ రాజ్ కు విమానాల కోసం విమానచార్జీలను హేతుబద్దం చేయాలని విమానయాన సంస్థలను కోరింది. వీహెచ్ పీ విపరీతంగా పెరిగిన విమాన చార్జీల కారణంగా భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు చేసిన తరువాత డీజీసీఏ ఈ విధంగా స్పందించింది.
ప్రభుత్వ జోక్యాన్ని కోరిన వీహెచ్ పీ..
విహెచ్పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇతర స్వచ్చంద సంస్థలు భక్తులకు ఉచితంగా సేవలు అందిస్తుండగా కొన్ని విమానయాన సంస్థలు చార్జీలు పెంచి భక్తులను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని విమానయాన సంస్థలు తమ ఎకానమీ క్లాస్ చార్జీలను 200 నుంచి 700 శాతానికి పెంచాయని చెప్పారు. అదే సమయంలో ప్రతిరైలు కూడా అసంఖ్యాకమైన బుకింగ్స్ తో ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి అన్యాయమైన విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
విహెచ్ పీ సందేశం..
ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన సంస్థలు తమ చార్జీలను హేతుబద్దీకరించుకుని, సేవలను విస్తరించాలని, ప్రయాణీకులకు మరిన్ని సౌకర్యాలను అందించడంపై శ్రద్ధ వహించాలని బన్సాల్ పేర్కొన్నారు. కుంభమేళాకు వస్తున్న ప్రయాణికులు తిరిగి రేట్లు తగ్గించి సహకరించాలని, లేకపోతే పౌర విమానయాన శాఖ తో సహ సంబంధం ఉన్న ప్రతిశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. 11 రోజుల్లో దాదాపుగా 12 కోట్ల మంది పుణ్య స్థానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే రేపు సాయంత్రం ప్రారంభం కాబోయో మౌనీ అమావాస్యకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. దీనికోసం యోగీ సర్కార్ దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మహాకుంభ మేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఫిబ్రవరి 26 మహా శివరాత్రి పర్వదినంతో ఇది ముగుస్తుంది.
Tags:    

Similar News