లిక్కర్ స్కామ్: కేజ్రీవాల్ కు కస్టడీ పొడిగించిన కోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌజ్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. మార్చి 1 వరకూ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ సందర్భంగా..

Update: 2024-03-28 13:42 GMT

ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ రిమాండ్ ను ఏప్రిల్ 1 వరకూ పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వూలు జారీ చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ మాత్రం తమకు ఏడు రోజుల కస్టడీ అవసరమని కోర్టుకు విన్నవించగా నాలుగు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వూలు జారీ చేసింది.

“ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడు కాదు. తన వ్యక్తిగత ప్రమేయంతో పాటు, ఆప్ కన్వీనర్‌గా ఉన్నందున, ఆ డబ్బును ఆప్ గోవా ప్రచారంలో ఉపయోగించారు, దీనికి సంబంధించి చాలా ఆధారాలు ఉన్నాయి.
జాతీయ మీడియా ప్రకారం, ఏఎస్ జీ SV రాజు విచారణ సందర్భంగా కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్ మెంట్లను రికార్డ్ చేసినట్లు వివరించారు. ప్రతి ప్రశ్నకు తప్పించుకునే సమాధానాలు ఇచ్చినట్లు అందులో వివరించారు.
“ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మాకు సహకరించడం లేదు. అతను కొన్ని కీలక కోడ్ వర్డ్, పాస్ వర్డ్ లను వెల్లడించడం లేదు. తన లాయర్లతో మాట్లాడి వాటిని ఇవ్వాలా? వద్దా ? అని చెప్తా అంటున్నారు, సమాధానాలు రాకపోతే మేమే వాటిని కనుగొనాల్సి ఉంటుంది”అని ASG అన్నారు.
ఇంతలో, అతని న్యాయవాది రమేష్ గుప్తా, తన వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కస్టడీలో ఉండటానికి తనకు అభ్యంతరం లేదని అంగీకరించారు. అయితే రిమాండ్‌ను కోరుతున్న కారణాలను వ్యతిరేకిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కేజ్రీవాల్ కు కస్టడీ ఇస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.
ఇది రాజకీయ కుట్ర అని, దీనికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని కేజ్రీవాల్ అన్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇడి కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టులోని కోర్టు గదికి తీసుకువస్తున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు.. కానీ ఇప్పటి వరకూ డబ్బు జాడ ఇంకా కనిపెట్టలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నా వ్యాఖ్యలను తన పిటిషన్ లో కేజ్రీవాల్ ప్రస్తావించారు.. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ED ఉద్దేశం” అని ఆయన కోర్టుముందు సమర్పించారు. ఎలక్టోరల్ బాండ్ల సమస్యపై కూడా ఆయన ఒక ప్రకటన చేస్తూ, “బిజెపికి డబ్బు అందుతోంది” అని పేర్కొన్నారు.
అయితే ఆయన ప్రకటనను ఈడీ వ్యతిరేకించింది. సిట్టింగ్ సీఎం ను అరెస్ట్ చేయడానిని నలుగురు వ్యక్తులు బయట చేసిన ప్రకటనలను పరిగణలోకి తీసుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. తనపై ఈడీ 25 వేల పేజీలు, సీబీఐ 31 వేల పేజీలు కోర్టుకు సమర్పించాయి. అయితే వాటిలో ఎక్కడా నేరాన్ని నిరూపించే ఆధారాలు లేవన్నారు. తనను ఏ కోర్టు కూడా దోషిగా నిరూపించలేదని అన్నారు. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయగా, కోర్టు మార్చి 28 వరకు రిమాండ్‌కు పంపింది.
Tags:    

Similar News