మరోసారి మేనల్లుడిని పార్టీ పదవుల నుంచి తొలగించిన మాయావతి

ఇకముందు ఎలాంటి వారసులు ఉండరని ప్రకటన;

Update: 2025-03-02 10:27 GMT

బీఎస్పీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయవతి మరోసారి తన మేనల్లుడి విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఆకాశ్ ఆనంద్ ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తాను జీవించి ఉన్నంత కాలం రాజకీయ వారసుడిని నియమించబోనని పేర్కొన్నారు.

పార్టీని బలోపేతం చేయడానికి దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీస్ బేరర్లతో లక్నోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ఆమె పార్టీ నాయకత్వంలో గణనీయంగా మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఆకాశ్ ఆనంద్ మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్దార్థ్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత బీఎస్పీ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడిపై తీసుకున్న నిర్ణయానికి సిద్దార్థ్ కారణమని, పార్టీని రెండు వర్గాలుగా విభజించడానికి సిద్దార్థ్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించారు.

ఇంతకుముందు కూడా..
మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆనంద్ ను ఇంతకుముందు కూడా ప్రకటించారు. అయితే అప్పట్లో వివాదాస్పద ప్రసంగాలు చేయడంతో ఆయనను పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తప్పించారు.
ఇప్పుడు మరోసారి పార్టీ బాధ్యతలు అప్పగించిన సంవత్సరంలోపే తొలగించారు. ప్రస్తుతం ఆకాశ్ స్థానంలో ఇద్దరు జాతీయ సమన్వయ కర్తలు ఉన్నారు. ఆకాశ్ తండ్రి మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్, పార్టీ ప్రముఖ నాయకుడు రాంజీ గౌతమ్ బాధ్యతలు చేపట్టారు.
అయితే మాయవతి సోదరుడు ఆనంద్ మాట్లాడుతూ.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తన మిగిలిన పిల్లలు రాజకీయేతర కుటుంబాలలో మాత్రమే వివాహం చేసుకుంటారు. తద్వారా భవిష్యత్ లో అశోక్ సిద్దార్థ్ కారణంగా పార్టీకి ఎటువంటి సమస్యలు ఎదురుకావని ప్రకటించారు. 

ఆకాశ్ తొలగింపుకు సంబంధించి మాయావతి ఎక్స్ ఖాతాలో ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ‘‘పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు పార్టీ సంస్థకు సంబంధించిన చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. తక్షణమే శ్రీ ఆకాశ్ ఆనంద్ ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించాం’’ అని ప్రకటించారు.
వారసుడిపై అభిప్రాయం..
పార్టీ నాయకులలో చాలాకాలంగా వివాదాస్పదంగా ఉన్న తన రాజకీయ వారసుడిని గురించి తాను జీవించి ఉన్నంత కాలం వారసుడు ఉండడని మాయావతి పునరుద్ఘాటించారు.
ఓ సమావేశంలో మాయావతి ప్రసంగిస్తూ ఉత్తరప్రదేశ్ బహుజన సమాజం పురోగతి రాష్ట్ర అభివృద్దికి మాత్రమే కాకుండా దేశం మొత్తం పురోగతికి కూడా కీలకమని చెప్పారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకల కోసం పార్టీ ప్రణాళికలను కూడా ఆమె పంచుకున్నారు. ఆయన సిద్దాంతాలను తమ అంకిత భావాన్ని పునరుద్ఘాటించారు.
Tags:    

Similar News