ఆపరేషన్ సిందూర్, వామపక్ష ఉగ్రవాదుల ఏరివేతను హైలైట్ చేసిన మోదీ
పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలకు విలువ్వాలని సూచన;
By : The Federal
Update: 2025-07-21 11:21 GMT
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు చేసిన తన ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ సహ నక్సలిజం పై పోరాటం, ద్రవ్యోల్భణం, అంతరిక్ష వరకూ అనేక అంశాలను ప్రస్తావించారు.
పహల్గాం ఉగ్రవాద ఘటనకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను, వారి స్థావరాలను నాశనం చేయడంలో సైన్యం చూపిన శక్తిని ప్రశంసిచారు. ఈ సమావేశాలు భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్చలలో నిండి ఉండాలని కోరుకుంటున్నారని మోదీ చెప్పారు.
ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు
1. ఆపరేషన్ సిందూర్:
ప్రధానమంత్రి ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ ప్రధానంగా ప్రస్తావించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత సాయుధ దళాలు నిర్వహించిన దాడుల్లో కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదులు, వారి స్థావరాలు నేలమట్టం అయ్యాయని అన్నారు.
భారత సైనిక బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం సాధించినట్లు ఆయన ప్రకటించారు.
ఈ ఆపరేషన్ లో మేడ్ ఇన్ ఇండియా సైనిక శక్తిని ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోయిందని కొనియాడారు. ఈ రోజుల్లో నేను ప్రపంచ ప్రజలను కలిసినప్పుడూ భారత్ తయారు చేస్తున్న ఆయుధాల పట్ల వారి ఆకర్షణ పెరుగుతోందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2. మావోయిస్టులపై యుద్ధం
మావోయిస్టుల ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అంతం చేయాలనే ఇటీవల ప్రయత్నం, ఆ ప్రాంతంలో సాధించిన ప్రధాన విజయాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.
‘‘నేడు మన భద్రతా దళాలు నక్సలిజాన్ని అంతం చేయడానికి కొత్త ఆత్మవిశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. నేడు అనేక జిల్లాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయి. భారత రాజ్యాంగం నక్సలిజంపై విజయం సాధించడాన్నిపట్ల మేము గర్విస్తున్నాము. రెడ్ కారిడార్లు, గ్రీన్ గోత్ కారిడార్లుగా రూపాంతరం చెందాయి’’ అని తన ప్రసంగంలో ప్రధాని చెప్పారు.
3. అంతరిక్ష యాత్ర
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేసిన ప్రయాణాన్ని మోదీ మాట్లాడటం ఇక్కడ ఎవరూ ఊహించలేని పరిణామం.
‘‘ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు విజయోత్సవ వేడుకలాంటివి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత జెండా ఎగరవేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. అందరూ ఎంపీలు, దేశ ప్రజలు ఒకే గొంతుతో ఈ ఘనతను కీర్తించారు. ఇది మన భవిష్యత్ మిషన్లకు ప్రేరణగా ఉంటుంది’’ అని మోదీ అన్నారు.
4. ఆర్థిక అంశాలు
భారత్ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడంపై కూడా మోదీ ప్రస్తావించారు. 2014 నుంచి ఇప్పటి వరకూ 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయట పడ్డారని చెప్పుకొచ్చారు.
యూపీఏ హయాంలోని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. మీరు మాకు( భారత ప్రజలను ఉద్దేశించి) 2014 లో అధికారం అప్పగించినప్పుడూ దేశం పెళుసుగా ఉంది. 2014 కి ముందు మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానంలో ఉన్నాము. నేడు మనం మూడో ప్రపంచ శక్తిగా ఎదగడానికి ప్రయాణం చేస్తున్నాము’’ అని ఆయన అన్నారు.
‘‘2014 కి ముందు దేశంలో ద్రవ్యోల్భణం రేటు రెండెంకెల స్థాయిలో ఉండేది. నేడు దాని స్థాయి దాదాపు రెండు శాతానికి పడిపోయింది. దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. దీనిని ప్రపంచంలోని అనేక సంస్థలు ప్రశంసిస్తున్నాము’’ అని ఆయన అన్నారు.
దేశంలో రుతుపవనాలు బాగా పురోగమిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ‘‘రుతుపవనాల ఆవిష్కరణ, నూతన సృష్టికి చిహ్నం. ఇది వ్యవసాయానికి ప్రయోజనకరమైన సీజన్ అని నివేదికలు ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
5. ఐక్యత శక్తి
దేశంలో ఐక్యత శక్తిని చూసిందని చెబుతూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘కాబట్టి అందరూ ఎంపీలు దానికి బలాన్ని ఇవ్వాలి. దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి రాజకీయ పార్టీకి దాని స్వంత ఎజెండా, దాని స్వంత పాత్ర ఉన్నప్పటికీ నేను కచ్చితంగా చెబుతాను.
కానీ నేను ఒక వాస్తవాన్ని అంగీకరిస్తున్నాను. ‘‘దల్ హిట్ మే మత్ భలే నా మిలే లేకిన్ దేశ్ హిట్ మే మన్ జరుర్ మిలే( ఒక పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా అభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలకు అభిప్రాయాల ఐక్యత ఉండాలి’’) అన్నారు.