ఐఎన్ఎస్ విక్రాంత్ లో మోదీ దీపావళి వేడుకలు

ప్రతి సంవత్సరం సైనికులతోనే వేడుకలు జరుపుకుంటున్న ప్రధాని

Update: 2025-10-20 07:28 GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ

ప్రతి సంవత్సరం సైనిక జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రధాని మోదీ ఈ సారి ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఈ క్రతువులో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ పాత్రను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన, కొన్ని నెలల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్, పాకిస్తాన్ అంతటా భయానక వాతావరణాన్ని నింపిందని అన్నారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఐఎన్ఎస్ విక్రాంత్ శత్రువుల ధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ప్రధాని మోదీ అన్నారు.

‘‘కొన్ని నెలల క్రితం విక్రాంత్ పేరు శత్రు సైన్యం పాక్ అంతటా భయానక తరంగాలను ఎలా పంపిందో మనం చూశాము. దాని శక్తి అలాంటిది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే శత్రువు ధైర్యాన్ని ఈ పేరు బద్దలు కొట్టింది.
అది ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మన సాయుధ దళాలకు సెల్యూట్ చేయాలనుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక కాదని, భారత కృషికి నిదర్శనమని కూడా ప్రధాని ఉద్ఘాటించారు.
‘‘ఐఎన్ఎస్ విక్రాంత్ ను దేశానికి అప్పగించినప్పుడూ విక్రాంత్ చాలా విశాలమైనది. అపారమైనది, అద్భుతమైనదని నేను చెప్పానని నాకు గుర్తు ఉంది. విక్రాంత్ ప్రత్యేకమైనది. ఇది కేవలం యుద్ధ నౌక కాదు. 21 వ శతాబ్ధంలో భారత్ చేసిన కృషి, ప్రతిభ, సామర్థ్యం, నిబద్ధతకు నిదర్శనం’’ అని మోదీ చెప్పారు.
‘‘భారత్ స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ ను అందుకున్న రోజు, మన భారత నావికాదళం వలసరాజ్యాల అణచివేతకు సంబంధించిన ఒక ప్రధాన చిహ్నాన్ని విస్మరించిందది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రేరణతో మన నావికాదళం కొత్త జెండాను స్వీకరించింది’’ అని ఆయన అన్నారు.
‘‘నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ లో గడిపిన రాత్రిని మాటల్లో చెప్పడం కష్టం. మన జవాన్లలో నిండిన అపారమైన శక్తి, ఉత్సాహాన్ని చూశాను. నిన్న మీరు దేశభక్తి గీతాలు పాడటం చూసినప్పుడూ, మీపాటలలో ఆపరేషన్ సిందూర్ ను మీరు వ్యక్త పరిచిన విధానం, యుద్ధభూమిలో నిలబడి జవాన్ అనుభవించిన దాన్ని వర్ణించడానికి ఏ పదాలు సరిపోవు’’ అని మోదీ చెప్పారు.
‘‘భారత సైనిక బలాన్ని నేను గమనించాను. ఈ పెద్ద ఓడలు, గాలికంటే వేగంగా కదిలే విమానాలు, జలాంతర్గాములు నడిపే వారిని ధైర్యంగా బలీయంగా చేస్తుంది. ఈ ఓడలు ఇనుముతో తయారు చేసి ఉండవచ్చు కానీ మీరు వాటిని అధిరోహించినప్పుడూ అవి దళాలకు సజీవ శ్వాసగా మారుతున్నాయి’’ అని ప్రధానిమంత్రి చెప్పారు.
‘‘ప్రతి క్షణంలో నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను. నేను ఢిల్లీ నుంచి బయల్దేరినప్పుడూ ఈ క్షణం నేను మీలా జీవించాలని అనుకున్నాను. కానీ మీ కృషి, తపస్సు, అంకితభావం చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. నేను సజీవంగా జీవించలేకపోయాయి. అయితే నేను మీ నుంచి అవగాహన పొందాను. మీ జీవితం చాలా కష్టమైనది తెలుసుకున్నాను’’ అని మోదీ శ్లాఘించారు.
Tags:    

Similar News