కుటుంబ వివాదాలతో తల్లి, నలుగురు చెల్లెల్ల హత్య
కొత్త సంవత్సరం వేళ యూపీలో ఘోరం;
By : The Federal
Update: 2025-01-01 09:46 GMT
కొత్త సంవత్సరం వేళ యూపీ లో విషాదం నెలకొంది. కుటుంబ వివాదాలతో తల్లి, నలుగురు చెల్లెల్లను సొంత సోదరుడు హత్య చేశారు. ఈ సంఘటన యూపీ రాజధాని లక్నోలోని ఓ హోటల్ లో బుధవారం జరిగింది. ఈ రోజు ఉదయం హోటల్ లో ఐదుగురు మృతదేహాలను కనుగొన్నామని పోలీసులు తెలిపారు.
నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ వెల్లడించారు. హోటల్ లో తిన్న ఆహారంలో నిందితుడు అర్షద్ మత్తుపదార్థాలు కలిపి తరువాత వారి మణికట్టు, గొంతులను బ్లేడ్ తో కట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలు, దుస్తులు పూర్తిగా రక్తంలో తడిసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
నిందితుడు అర్షద్ (24), ఆగ్రాకి చెందిన వాడు. ఈ భయంకరమైన హత్యలతో ఉత్తర ప్రదేశ్ ఉలిక్కి పడింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, రవీనా త్యాగీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత తిరిగి సంఘటనా స్థలానికి తీసుకొచ్చి వివరాలు సేకరించారు. చనిపోయిన వారిని అలియా(9), అల్షియా(19) అక్ష(16), రెహమాన్(18) వీరు సోదరిమణులు, ఐదో వ్యక్తి తల్లి ఆస్మా అని తేలింది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సంఘటన స్థలంలోకి ఫోరెన్సిక్ టీమ్ తన ఆధీనంలోకి తీసుకుంది. సంఘటన స్థలంలోని ఆధారాలను సేకరిస్తోంది. హోటల్ నుంచే విచారణ ప్రారంభించామని డీసీపీ తెలిపారు. ముందుగా స్టాప్ తో మాట్లాడామని అన్నారు. హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నామని జాయింట్ కమిషనర్(క్రైమ్) బాబులో కుమార్ చెప్పారు. ప్రస్తుతం మృతదేహాలను పరిశీలిస్తున్నామని , పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు.