నరేన్ సింగ్ చౌరా ఎవరూ .. బాదల్ పై కాల్పులు ఎందుకు జరిపాడు?

పంజాబ్ లో తిరిగి ఖలిస్తాన్ ఉగ్రవాదం ఉనికి చాటుకునేందుకు ప్రయత్నించింది. తాజాగా శిరోమణి అకాలీదళ్ మాజీ చీఫ్ బాదల్ ను కాల్చి చంపేందుకు..

Update: 2024-12-04 10:08 GMT

కొద్ది కాలంగా పంజాబ్ లో అలజడి సృష్టించేందుకు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేస్తున్న శిరోమణి అకాలీదళ్ మాజీ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను కాల్చి చంపడానికి ఖలిస్తాన్ తీవ్రవాదీ నరేన్ సింగ్ చౌరా ప్రయత్నించారు.

అందరూ చూస్తుండగా తుఫాకీతో కాల్పులు జరపగా, భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కాల్పులు జరిపిన నరేన్ సింగ్ ఖలిస్తాన్ ఉగ్రవాదులతో చాలా సుదీర్ఘకాలంగా సంబంధాలు నెరిపిన చరిత్ర బయట పడింది.

68 ఏళ్ల నరేన్ సింగ్ చౌరా నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద గ్రూప్ బబ్బర్ ఖల్సా లేదా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌ లో చురకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. పంజాబ్ స్పెషల్ డిజిపి (లా అండ్ ఆర్డర్) ప్రకారం అర్పిత్ శుక్లా మాట్లాడుతూ, గతంలో "నేర నేపథ్యం" ఉన్న చౌరాను అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
అతనిపై 21కి పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. చౌరా వేర్పాటువాద తీవ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసిన ఖలిస్తాన్ తీవ్రవాది అని, ప్రత్యేక ఖలిస్తాన్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమంలో కీలక నాయకుడు అని పలు మీడియా నివేదికలు తెలిపాయి.
బురైల్ జైల్బ్రేక్
2004లో చండీగఢ్‌లో జరిగిన బురైల్ జైల్‌ బ్రేక్‌ సంఘటనలో ప్రధాన సూత్రధారిగా నరైన్ చౌరా సింగ్ మాస్టర్ మైండ్ అని తేలింది. ఈ జైల్‌బ్రేక్‌లో నలుగురు ఖైదీలు 104 అడుగుల సొరంగం తవ్వి జైలు నుంచి తప్పించుకున్నారు. ఈ నలుగురు ఖైదీలు బబ్బర్ ఖల్సా చీఫ్ జగ్తార్ సింగ్ హవారా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకులు పరమ్‌జిత్ సింగ్ భియోరా వంటి కరుడుట్టిన ఉగ్రవాదులు ఉన్నారు.
ఆ సమయంలో నరేన్ సింగ్ జైలులో కరెంటును నిలిపివేసి వారికి సాయం చేశాడు. తరువాత జైలు సరిహద్దు గోడ దగ్గర తుపాకీతో పట్టుబడ్డాడు. ఈ కేసులో 2005లో బెయిల్ పొంది బయటకు వచ్చాడు కానీ తిరిగి కోర్టుకు హజరుకాకపోవడంతో పరారీ ఉన్న నేరస్థుడిగా ప్రకటించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తీవ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అక్రమంగా ఆయుధాలు దేశంలోకి తీసుకురావడానికి సాయం చేశాడు. 2013లో, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అరెస్టయ్యాడు, అతని నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
పాకిస్తాన్ లింకులు
నరేన్ సింగ్ ఏప్రిల్ 4, 1956న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని చౌరా గ్రామంలో చనమ్ సింగ్ - గుర్నామ్ సింగ్ దంపతులకు జన్మించాడు. 1984లోనే, పంజాబ్‌లో ఉగ్రవాదం ప్రారంభ దశలో నరైన్ సింగ్ పాకిస్థాన్‌కు పారిపోయాడు. అక్కడ, పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను అక్రమంగా భారత్‌లోకి తరలించడంలో కీలక పాత్ర పోషించాడు.
పాకిస్తాన్‌లో గెరిల్లా యుద్ధం, దేశద్రోహ సాహిత్యంపై ఒక పుస్తకాన్ని రాశాడు.  1990ల మధ్యలో భారత్‌కు తిరిగి వచ్చిన చౌరా పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడని పోలీసులు తెలిపారు. అతను చాలా సంవత్సరాలు పాంథిక్ నాయకుడిగా కూడా చురుకుగా ఉన్నాడు. తాజాగా బాదల్ ను చంపి పంజాబ్ లో తిరిగి ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. 
Tags:    

Similar News