ఆపరేషన్ సింధూర్: విమానాశ్రయాల మూసివేత, పలు విమానాల దారి మళ్లింపు

ఉత్తర భారతంలో కనిపిస్తున్న ప్రభావం;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-07 04:34 GMT
విమానాశ్రయంలో నిలిపి ఉన్న విమానాలు

పహల్గామ్ ఉగ్రవాద దాడులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక విమానాశ్రయాలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అనేక విమానాశ్రయాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకుంది.

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జమ్మూకాశ్మీర్, లేహ్, జోధ్ పూర్, అమృత్ సర్, భుజ్, జామ్ నగర్, చండీగఢ్, రాజ్ కోట్ లక వెళ్లే విమానాలు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు విమానాలు మధ్యాహ్నం వరకూ రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. 
Full View
అంతర్జాతీయ విమానాలు..
రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. ‘‘అమృత్ సర్ వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లిస్తున్నాం. ఈ ఊహించని అంతరాయం కారణంగా కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము’’ అని ఎయిర్ లైన్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ప్రస్తుత పరిస్థితుల కారణంగా ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్ సర్ తో సహ ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో విమానాశ్రయాలు తదుపరి నోటీస్ వచ్చే వరకూ మూసివేస్తున్నారని స్పెస్ జెట్ తన ఖాతాలో తెలియజేసింది. రాకపోకలపై ఈ ప్రభావం కనిపిస్తుందని, కొన్ని ఆలస్యం జరగవచ్చని ఈ సంస్థ తెలియజేసింది.
ఉత్తర భారత విమానాలపై ప్రభావం...
ఈ ప్రాంతంలో మారుతున్న వైమానిక పరిస్థితుల కారణంగా శ్రీనగర్, జమ్మూకాశ్మీర్, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాలకు వెళ్లే విమానాలు ఆలస్యం జరగవచ్చని ఇండిగో కూడా ప్రకటించింది.
బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేశాయి. వీటిల్ జైష్ ఏ మహ్మద్ స్థావరమైన బహవల్పూర్, లష్కర్ స్థావరమైన మురిద్కే ఉన్నాయి.
ఈ దాడుల్లో వందల మంది ఉగ్రవాదులు హతమైనట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. అలాగే భారత్ పైకి ప్రతిదాడికి ప్రయత్నించిన చైనా తయారీ జేఎఫ్-10 ను ఆకాశ్ క్షిపణి కూల్చివేసినట్లు కూడా స్థానికులు తీసిన వీడియోల ప్రకారం తెలుస్తోంది. అయితే వీటిని ఇంకా ఇరుదేశాలు ధృవీకరించలేదు. 

 

Tags:    

Similar News