ఆపరేషన్ సింధూర్: లాహోర్ లోని వాయు రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం: భారత్

అధికారికంగా ప్రకటించిన కర్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-08 12:22 GMT
జమ్మూ: సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు

భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. నిన్న రాత్రి భారత సైన్యాలు ఉగ్రవాదులపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో దాడులు జరపడంతో దానవ దాయాదీ దేశం ఈ రోజు ప్రతీకార దాడులు చేసే ప్రయత్నం చేసింది. దేశంలోని అమృత్ సర్, లూథియానా సహ సరిహద్దులోని సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేసింది.

ఈ పరిణామంతో భారత్ కూడా ఎదురుదాడులకు దిగింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను ఇంటిగ్రేటేడ్ కౌంటర్ యూఎఎస్ గ్రిడ్, వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణులను న్యూట్రలైజ్ చేశాయి.
వీటి శిథిలాలను దేశంలోని అనేక ప్రదేశాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకారంగా గురువారం ఉదయం మన సాయుధ దళాలు పాకిస్తాన్ లోని అనేక ప్రదేశాల్లో వైమానిక రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి.
పాక్ ప్రధాన సైనిక స్థావరమైన రావల్పిండి తో పాటు లాహోర్, ఇస్లామాబాద్ లో ఈ దాడులు జరిగాయి. అలాగే లాహోర్ లోని ఎయిర్ ఢిపెన్స్ సిస్టమ్ ను కూడా ఇండియా నాశనం చేసింది. ఇందుకోసం ఎస్ -400 వ్యవస్థను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న కాల్పులు..
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సాయుధ దళాలు పొరుగు దేశంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న ఒకరోజు తరువాత గురువారం జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ దళాలు వరుసగా రెండో రోజు కాల్పులు జరిపాయి.
పాకిస్తాన్ వైపు కర్నా ప్రాంతంలోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి తరువాత షెల్ , మోర్టార్లను ప్రయోగించిందని అధికారులు తెలిపారు. ఎటువంటి కవ్వింపు లేకుండా జరిగిన కాల్పులకు వ్యతిరేకంగా భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ప్రతిస్పందించాయి. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
ఆపరేషన్ సింధూర్ తరువాత జమ్మూలోని పూంచ్, తంగ్దర్ ప్రాంతాలలో ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాలు జరిపిన షెల్లింగ్ దాడుల్లో దాదాపు 15 మంది సాధారణ పౌరులు మరణించారు.
మరో 43 మంది గాయపడ్డారు. సరిహద్దులో భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ ప్రజలు సురక్షిత ప్రజలకు తరలి వెళ్తున్నారు.
శ్రీనగర్ లో కంట్రోల్ రూమ్..
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించడానికి శ్రీనగర్ లోని అధికారులు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జిల్లా అత్యవసర సెంటర్ (డీఈఓసీ) లో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ మొత్తం పర్యవేక్షణలో ఒక ఉమ్మడి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశాము’’ అని స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ ఒక ఉత్తర్వులో తెలిపారు.
దాడుల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. తరువాత భద్రతా కేబినేట్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారు. మంత్రి వర్గంలో ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించినందుకు ప్రధానమంత్రి భారత సాయుధ దళాలను ప్రశంసించారు.
ఆపరేషన్ సింధూర్..
పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారు జామున పాకిస్తాన్ లోని జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తోయిబా, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాలపై 25 నిమిషాల పాటు నాన్ ఎస్కలేటరీ మిషన్ లో డీప్ స్ట్రైక్ క్షిపణులు ఉపయోగించి ధ్వంసం చేశాయి.
ఈ అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన వారిని, ప్రణాళిక వేసిన వారిని న్యాయం చేయడానికి దాడులు చేసినట్లు చెప్పారు. 1971 తరువాత పాక్ భూభాగంలోకి వెళ్లి భారత్ మొదటి సారిగా వైమానిక దాడులు చేసింది.
భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు మరణించారని జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ అంగీకరించారు.
ఏ ప్రాంతాల్లో దాడులంటే..
ఆపరేషన్ సింధూర్ కింద భారత సైన్యాలు మురిడ్కేలోని లష్కర్ ఏ తోయిబా కి చెందిన మర్కజ్ తైబా, బహవల్ పూర్ లోని జైషే మహ్మద్ కి చెందిన మర్కజ్ సుభాన్ అల్లాహ్, సియాల్ కోట్ లోని హిజ్ బుల్ ముజిహిదిన్, మెహమూనా జోయా ఫెసిలిటి, బర్నాలాలోని అహ్లె హదీత్ లోని లష్కర్ స్థావరం, ముజఫరాబాద్ లోని షావాయి నల్లాలోని ఉన్న దాని శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సైనిక అధికారులు తెలిపారు.
Tags:    

Similar News