ఆపరేషన్ సింధూర్: ఈ దాడులు ఎందుకంత ప్రత్యేకమైనవి?

దాడుల్లో ఉపయోగించిన స్కాల్ప్, హామర్ బాంబులు;

Update: 2025-05-07 09:09 GMT
ఆపరేషన్ సింధూర్ దాడి దృశ్యాలు

పహల్గామ్ లో జరిగిన ఊచకోత తరువాత పాకిస్తాన్ పై భారత్ నిర్వహించిన సైనిక దాడి 2019 బాలాకోట్ ఆపరేషన్ తరువాత న్యూఢిల్లీ నిర్వహించిన అత్యంత విస్తృతమైన సరిహద్దు దాడిగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

నిన్న అర్ధరాత్రి తరువాత నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ తో లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ), జైషే మహ్మద్(జేఈఎం), హిబ్బుల్ ముజాహిద్దీన్(హెచ్ఎం) కు చెందిన తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నేలమట్టం చేసింది. ఇది మారిన భారత వ్యూహాత్మక వైఖరిని తెలియజేస్తుందని న్యూఢిల్లీలోని అధికారులు తెలిపారు.

సాంకేతికంగా దృఢమైనది..
2016 ఉరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులతో సహ అంతకుముందు భారత సైనిక కార్యకలాపాల పరిమాణం, పరిధిలో కొంచెం పరిమితంగా ఉన్నాయి. అయితే ‘ఆపరేషన్ సింధూర్’ సాంకేతికంగా ధృడమైనవి, విస్తృతమైనది, భారత్ ఇప్పటి వరకూ ఇలాంటివి ఇంతకుముందు చేపట్టలేదని ఒక అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. కొన్ని లక్ష్యాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండగా, మరికొన్ని పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. ఇది భారత సైన్యం సత్తాను చూపెడుతుందన్నారు.
70 మంది హతం..
త్రివిధ దళాలు జరిపిన దాడిలో 70 మంది ఉగ్రవాదులు మరణించారని, 60 మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘‘ఉగ్రవాద నష్టం, తీవ్రవాద నెట్ వర్క్ లకు వారి నిర్వాహకులకు బలమైన సందేశాన్ని పంపింది.’’ ఆ అధికారి మీడియాకు తెలిపారు. ఇంతకుముందులా భారత్ ఇక చూద్దాం అని కాకుండా, ముందస్తుగా దాడులు చేస్తామని, మీ ప్రదేశాలు మాకెంతో దూరంలో లేవనే బలమైన సందేశాలు పంపినట్లు అయిందని చెప్పారు.
పహల్గామ్ ఊచకోత..
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గమ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. వీరి మతం అడిగి చంపడమే కాకుండా వెళ్లి మోదీకి చెప్పుకోండని వికృత సమాధానాలు ఇచ్చారు. జైష్ ఏ మహ్మద్ తో సంబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ రక్తపాతానికి బాధ్యత వహించింది.
తొమ్మిది ప్రాంతాలు టార్గెట్ గా దాడులు..
పాకిస్తాన్ నుంచి అన్ని రకాలుగా సాయం పొందుతున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు సైనిక అధికారులు చెబుతున్నారు.
ఈ దాడుల్లో ముజఫరాబాద్, కోట్లీ, బహవల్పూర్, రావలాకోట్, చక్ స్వరీ, భింబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ లో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ప్రాంతాలలో 24 క్షిపణులు ప్రయోగించారు. ఇది న్యూఢిల్లీ అమలు చేసిన విస్తృత శ్రేణి సైనిక చర్య.
నిఘా ఆధారిత ఆపరేషన్..
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. భారత నిఘా సంస్థ ఉపగ్రహ చిత్రాలను మానవ వనరులు, సమాచార మార్పిడిని ఉపయోగించి జేఈఎం, ఎల్ఈటీ, హెచ్ఎం వంటి గ్రూపులు ఆక్టివ్ గా ఉన్నాయని నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం సైన్యం లక్ష్యంగా చేసుకున్న ప్రతి ప్రాంతం కూడా తీవ్రవాదులకు ఆవాసాలే అని తెలుస్తోంది.
క్షిపణి దాడులు..
ఈ ఆపరేషన్ లో ఎయిర్ నుంచి ఎర్త్ పైకి ఉపయోగించగల స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు ఉపయోగించినట్లు అంచనాలున్నాయి.
వీటిలో భారత భూభాగం నుంచి కొన్నింటిని ప్రయోగించగా, కొన్ని స్వయంగా భారత్ వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై జారవిడిచింది. గాలిలోనే ఇంధనం నింపగల విమానాలను మద్దతుతో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.
250 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన స్కాల్ప్ క్షిపణులను బంకర్లను ధ్వంసం చేయడానికి ఉపయోగించారు. కామికాజ్ డ్రోన్లను ఉపయోగించి లక్ష్యాలపై ఆత్మాహుతి దాడి చేశారు. ఇవి ముందుగా నిఘా సమాచారాన్ని సేకరించి తరువాతనే దాడులకు పాల్పడ్డాయని తెలుస్తోంది.
Tags:    

Similar News