పహల్గామ్ దాడే నిజమైన ఎస్కలేషన్: విక్రమ్ మిస్త్రీ

పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-08 13:51 GMT
పూంచ్ లో బంధువును కోల్పోయి రోదిస్తున్న మహిళ

పహల్గామ్ దాడులకు పాల్పడి పాకిస్తానే నిజమైన ఉద్రిక్తతలను సృష్టించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. ఈ రోజు ఉదయం నుంచి సరిహద్దులో జరుగుతున్న అంశాలకు సంబంధించి రక్షణ, విదేశాంగ శాఖలు సంయుక్తంగా సమావేశం నిర్వహించాయి.

భారత్ లోని ఉత్తర, పశ్చిమ భారతంలోని 15 ప్రదేశాలపై దాడి చేయడానికి పాక్ సైన్యం చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు సైన్యం ప్రకటించింది. దానవ దేశం ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లను ఉపయోగించి కూల్చివేసినట్లు తెలిపింది.
అలాగే లాహోర్ లోని పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు కూడా విదేశాంగ, రక్షణ శాఖ నిర్వహించిన సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఇది ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయని తెలియజేస్తోంది.
బుధవారం రాత్రి పాకిస్తాన్ సైన్యం అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్ కోట్, అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరరలై, భుజ్ లను లక్ష్యంగా చేసుకున్నందుకు ప్రయత్నించిందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ప్రయత్నాలను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాప్ట్ సిస్టమ్(గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) ద్వారా తిప్పికొట్టినట్లు తెలిపారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తనకు సంబంధం లేదని చేతులు కడుక్కోవడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. పాకిస్తాన్ సమాచార మంత్రి తమ దేశంలో ఉగ్రవాదులు లేరని అంటున్నారని, కానీ లేరని నిరూపించమని అతనికి అక్కడ సవాల్ ఎదురైందని చెప్పారు.
ఐరాసలో కూడా టీఆర్ఎఫ్ పై పూర్తి ఆధారాలు ఇచ్చామని, దానిపై నిషేధం విధించమని తీర్మానం చేస్తే దానికి పాక్ అడ్డుపడిందని, నిన్నటి ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఎవరు హజరయ్యారో చూస్తే ప్రపంచానికి నిజం ఏంటో తెలుస్తుందని చెప్పారు.
దేశంలోని సిక్కు కమ్యూనిటీని పాక్ టార్గెట్ చేసిందని చెప్పారు. జమ్మూకాశ్మీర్ లోని సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారని, ఇందులో 16 మంది మరణించారని దానికి సంబంధించి ఫొటోలు చూపించారు. టీఆర్ఎఫ్, లష్కర్ ఏ తోయిబాకు ముసుగు సంస్థ అని, దానికి సంబంధించిన అనేక ఆధారాలు ఇచ్చినట్లు వివరించారు.
Tags:    

Similar News