270 మంది అభ్యర్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన టీచర్స్ పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు తెలిసింది. పోలీసులు 270 మంది అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-03-17 07:45 GMT

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) నిర్వహించిన టీచర్స్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ (టిఆర్‌ఇ)-3 పేపర్ లీక్ అయ్యిందని తెలిసింది. ఈ ఆరోపణలపై జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో 270 మంది అభ్యర్థులను బీహార్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు (ఇఒయు) అదుపులోకి తీసుకున్నారు. మార్చి 14, 15 తేదీలలో హజారీ బాగ్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పరీక్ష పత్రాలు ఇక్కడికి సరఫరా అయినట్లు కనుగొన్నారు.

పరీక్ష రోజు లీక్ వీరులు ఉదయం 3 గంటలకు వారి పరీక్ష కేంద్రాల నుంచి బయలుదేరాల్సి ఉంది. ఇదే సమయంలో మేము వారిని పట్టుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. విచారణ అనంతరం లీక్ లతో సంబంధం ఉన్న కొంతమంది ముఠా సభ్యులను కూడా పోలీసులు పట్టుకున్నారు.
TRE-3 పేపర్ లీకేజీకి సూత్రధారిగా భావిస్తున్న ఐదుగురిని పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ప్రశ్నపత్రాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, పెన్ డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్రశ్నాపత్రం అభ్యర్థులకు ఇచ్చినందుకు భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) మార్చి 15న ఆఫ్‌లైన్ మోడ్‌లో ప్రైమరీ టీచర్లు మిడిల్ స్కూల్ టీచర్ల కోసం TRE-3ని నిర్వహించింది. దీనికి ముందు, BPSC నిర్వహించిన టీచర్స్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (TRE-2)లో 96,823 మంది అభ్యర్థులు పాసైయ్యారు.
Tags:    

Similar News