ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోదీ

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయన్న భారత ప్రధాని;

Update: 2025-09-06 07:14 GMT
భారత ప్రధాని మోదీ

భారత్ పై ఇన్నాళ్లు సుంకాల రంకెలు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నిన్న స్వరం మార్చి భారత్, రష్యాను దూరం చేసుకున్నామని వ్యాఖ్యానించారు. చైనా చేతిలో భారత్, రష్యా లు చిక్కుకున్నాయని కూడా అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. భారత్, అమెరికా మధ్య సానుకూల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. ‘‘మా సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలను, సానుకూల అంచనాను లోతుగా అభినందిస్తున్నాము. భారత్, అమెరికా సానుకూల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి’’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపాలని అమెరికా, భారత్ ను కోరింది. ఇందుకు న్యూఢిల్లీ నిరాకరించడంతో భారీగా సుంకాలు విధించారు. దీనిపై భారత్ ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా తన పనితాను చేసుకుపోతూ ఉంది.
భారత్ తో ప్రత్యేక బంధం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ..భారత్- అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైన సంబంధంగా’’ అభివర్ణించారు. తాను, ప్రధాని మోదీ ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటామని అన్నారు. అయితే ప్రధాని మోదీ చేస్తున్న పనుల పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
‘‘నేను ఎప్పుడూ ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటాను. ఆయన గొప్ప ప్రధానమత్రి. నేను ఎల్లప్పుడూ స్నేహంగానే ఉంాను. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు.
కానీ భారత్, అమెరికా మధ్య చాలా స్పష్టమైన బంధం ఉంది. భయపడాల్సిన పనిలేదు. మనకు అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటాయి.’’ అని ట్రంప్ అన్నారు.
భారత్ ను మన భాగస్వామ్యం నుంచి పక్కకు వెళ్లిందా అనే ట్రూత్ సోషల్ లో ప్రశ్న అడిగినప్పడూ ట్రంప్ దీనికి సమాధానం ఇచ్చారు. ‘‘మనం భారత్ ను కోల్పోయామని నేను అనుకోను’’ అని స్పష్టం చేశారు.
‘‘నేను ప్రధాని మోదీతో చాలా బాగా కలిసిపోతాను. మీకు తెలుసు. ఆయన రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్నారు. మేము రోజ్ గార్డెన్ కు వెళ్లాము’’ అని ఆయన అన్నారు. భారత్ తో వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయని చెప్పారు.
Tags:    

Similar News