‘‘రాధిక యాదవ్ జీవితాన్ని తండ్రే దుర్భరంగా మార్చాడు’’

సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగ పోస్ట్ చేసిన స్నేహితురాలు;

Update: 2025-07-13 11:06 GMT
రాధిక యాదవ్

గురుగ్రామ్ 25 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ తండ్రి చేతిలో దారుణంగా హత్యకు గురైన మూడు రోజుల తరువాత ఆమె స్నేహితురాలు ఒకరు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో అనేక ఆరోపణలు చేశారు.

రాధిక ను తండ్రి దీపక్ యాదవ్ నియంత్రించే వాడని తోటీ స్నేహితురాలు టెన్నిస్ క్రీడాకారిణి హిమాన్షిక సింగ్ రాజ్ పుత్ ఆరోపించారు. రాధిక చాలాకాలం నిర్భంధ వాతావరణంలో నివసించిందని, క్రీడల్లో భాగంగా పొట్టి దుస్తులు ధరిస్తే తల్లిదండ్రులే అవమానించారని ఆమె ఆరోపించారు.
‘‘నా ప్రాణ స్నేహితురాలు రాధికను ఆమె తండ్రే హత్య చేశాడు. తుపాకీతో ఐదుసార్లు కాల్చాడు. నాలుగు బుల్లెట్లు తన శరీరం నుంచి దూసుకెళ్లాయి. అతను (దీపక్ యాదవ్) తన నియంత్రణ, నిరంతరం విమర్శలతో ఆమె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్బరం చేశాడు.
చివరికి ఆమె విజయం పట్ల అసూయపడే స్నేహితులు అని పిలిచే వారి మాట విన్నాడు.’’ అని హిమాన్షిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోతో పోస్ట్ చేసింది.
‘‘రాధిక తన టెన్నిస్ కెరీర్ లో చాలా కష్టపడింది. తన సొంత అకాడమీని కూడా నిర్మించుకుంది. ఆమె చాలా బాగా రాణించేది. కానీ ఆమె స్వతంత్య్రంగా ఉండటం చూసి వారు తట్టుకోలేకపోయారు.
షార్ట్స్ ధరించినందుకు అబ్బాయిలతో మాట్లాడినందుకు వారి నిబంధనలు పాటించినందుకు కూడా ఆమెను తీవ్రంగా అవమానించారు’’ అని హిమాన్షి పేర్కొన్నారు.
గురుగ్రామ్ లోని సెక్టార్ 57 లోని వారి ఇంట్లో రాధికపై ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు గుండ్ల కాల్పులు జరిగాయి. నాలుగు గుండ్లు ఆమె వెనక భాగంలో మూడు బుల్లెట్లు దిగాయి. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె గాయాలతో మరణించింది. శుక్రవారం ఆమె కుటుంబం స్వస్థలమైన వజీరాబాద్ లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.
లవ్ జిహాద్ కోణం లేదు..
హత్య వెనక మతపరమైన కోణం లేదని హిమాన్షిక తెలిపింది. ‘‘ప్రజలు దీనిని లవ్ జిహాద్ అని పిలుస్తున్నారు. కానీ దీనికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి.’’ అని ఆమె ప్రశ్నించింది. నిజానికి చాలా మందితో మాట్లాడటానికి విముఖత చూపించింది. ఆమె చాలాకాలం ఒంటరిగా ఉంది. ఆమె ఇప్పుడూ ఇంటిలో ఎప్పుడూ స్వేచ్ఛ అనుభవించలేదని తెలిపింది.
‘‘మేము ఇద్దరం 2012 నుంచి కలిసి ఆడటం మొదలు పెట్టాము. మేము కలిసి ప్రయాణించాము. కలిసి మ్యాచ్ లు ఆడాము. ఆమె తన కుటుంబం వెలుపల ఎవరితోనూ మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు.
ఇంట్లో ఆంక్షల కారణంగా ఆమె చాలా రిజర్వ్ గా ఉండేది. ఆమె ప్రతి కదలికను ఇంట్లో చెప్పాల్సి వచ్చేది. వీడియోకాల్స్ లో కూడా తన తల్లిదండ్రులకు తాను ఎవరితో ఉందో చూపించాల్సి ఉండేది.
నేను కూడా చాలాసార్లు కెమెరా ముందు కనిపించాల్సి వచ్చింది. తన ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలోనే అకాడమీ ఉన్నప్పటికీ ఆంక్షలు అనుభవించాల్సి వచ్చింది’’ అని హిమాన్షిక చెప్పింది.
రాధికకు ఫోటో, వీడియోలు అంటే చాలా ఇష్టం, కానీ ఇంట్లో పరిస్థితి వల్ల క్రమంగా మానేసింది. ఆమె స్వతంత్య్రం గా ఉండటం వారికి నచ్చలేదని హిమాన్షిక జోడించింది.
నేరం ఒప్పుకున్న దీపక్..
రాధికను తాను చంపినట్లు దీపక్ యాదవ్ తనతో చెప్పినట్లు మేనమామ విలేకరులతో చెప్పాడు. అతన్ని వెంటనే ఉరితీయాలని అన్నాడు. ‘‘దీపక్ కుటుంబం బాగానే ఉంది. దీపక్ తన తప్పును గ్రహించాడు. పశ్చాత్తాపం కంటే గొప్ప శిక్ష ఎవరికి ఉండదు. మొత్తం కుటుంబం షాక్ లో ఉంది. రాధిక కూడా మోడల్ కావాలని కోరుకుంది. ఆమె ఒక పాటను కంపోజ్ చేసింది. ’’ అని రాధిక మేనమామ అన్నారు.
రాధిక యాదవ్, ఆమె కోచ్ అజయ్ యాదవ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ బయటపడింది. దీనిలో రాధికా యాదవ్ ఎలాగైనా ఇంటిని వదిలి వెళ్లాలని, విదేశాలకు వెళ్లాలని కూడా చర్చించారని తెలుస్తోంది. ఇది టెన్నిస్ క్రీడాకారిణి ఆమె తండ్రికి మధ్య వివాదం ఉందనే ఊహగానాలకు దారితీసింది. అయితే ఈ కోణాన్ని పరిశీలించడం లేదని పోలీసులు స్ఫష్టం చేశారు.
Tags:    

Similar News