22 మంది పిల్లలను దత్తత తీసుకోనున్న రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్ తరువాత దాడులకు తెగబడిన పాకిస్తాన్;
By : The Federal
Update: 2025-07-29 10:58 GMT
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా తెలిపారు.
పాకిస్తాన్ దళాల దాడుల కారణంగా ఫూంచ్ లోని తల్లిదండ్రులిద్దరిని లేదా కుటుంబంలోని ఏకైక జీవనాధారాన్ని కోల్పోయిన 22 మంది పిల్లల విద్యా ఖర్చులను రాహుల్ భరిస్తారని కర్రా వివరించినట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
పిల్లలు తమ చదువును నిరంతరాయంగా కొనసాగించేలా చూసుకోవడానికి బుధవారం మొదటి విడత నిధులు పంపిణీ చేస్తామని చెప్పారు. వారు పట్టభద్రులయ్యే వరకూ ఆర్థిక సాయం కొనసాగుతుందని కర్రా వివరించారు.
సర్వే తరువాత పేర్లు ఖరారు..
మే నెలలో రాహుల్ పూంచ్ ప్రాంతంలో పర్యటించారు. సంఘర్ఘణ సమయంలో ప్రభావితమైన పిల్లల జాబితాను రూపొందించమని ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కోరారు.
నాయకులు ఒక సర్వే నిర్వహించి, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి జాబితాను ఖరారు చేశారు. పూంచ్ లోని క్రైస్ట్ పబ్లిక్ స్కూల్ ను కూడా సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో సంభాషించారు. ఆ పాఠశాలకు చెందిన 12 ఏళ్ల కవల విద్యార్థులు షెల్లింగ్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
కాంగ్రెస్ నాయకుడు పిల్లలతో మాట్లాడుతూ.. వారి ఇద్దరు స్నేహితులను కోల్పోయినందుకు వారి పట్ల తాను చాలా గర్వపడుతున్నానని, అందుకు చాలా బాధపడుతున్నానని అన్నారు.
పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఈ పరిస్థితికి వారు స్పందించడానికి సరైన మార్గం నిజంగా కష్టపడి చదవడం, నిజంగా కష్టపడి ఆడటం పాఠశాలలో చాలామంది స్నేహితులను సంపాదించడం’’ ని ఆయన హమీ ఇచ్చారు.
పాకిస్తాన్ దళాలు సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో పూంచ్ పట్టణం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ఘర్షణలో ఒక మత పాఠశాలపై జరిగిన దాడిలో ఒక విద్యార్థి మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.