కేజ్రీవాల్ ను సీఎం పదని నుంచి తొలగించండి: పిల్ పై ఢిల్లీ హైకోర్టు..

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ రిమాండ్ లో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను వెంటనే పదవి నుంచి దింపేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Update: 2024-03-28 09:45 GMT

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది తమ పరిధిలోని అంశంకాదని తేల్చిచెప్పింది. "చట్టానికి అనుగుణంగా ప్రభుత్వంలోని ఇతర విభాగాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

విచారణ సందర్భంగా, కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించడంపై న్యాయపరమైన అడ్డంకిని చూపాలని పిటిషనర్ సుర్జిత్ సింగ్ యాదవ్ తరపు న్యాయవాదిని కోర్టు కోరింది. "ప్రాక్టికల్ ఇబ్బందులు ఉండవచ్చు కానీ అది వేరే విషయం. లీగల్ బార్ ఎక్కడ ఉంది?" అని కోర్టు ప్రశ్నించింది. మనీలాండరింగ్ అనేది ప్రస్తుతం అభియోగం మాత్రమే అని, విచారణ పూర్తి అయి తుది తీర్పు వచ్చాక మాత్రమే రాజ్యాంగ రక్షణ పరమైన చర్యలు కోర్టులు తీసుకుంటాయంది.
మార్చి 21న అరెస్టు చేయబడిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, తరువాత రిమాండ్ చేయబడ్డారు. అక్కడి నుంచి ఆదేశాలు అమలు చేస్తున్నారు.
Tags:    

Similar News