నీట్ లీక్: ఎవరూ ఈ సంజీవ్ దహియా? చరిత్ర మొత్తం..
నీట్ పేపర్ లీక్ లో ప్రధాన నిందితుడు సంజీవ్ దహియా అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దహియా పరారీ ఉన్నాడు. మరో వైపు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్..
By : The Federal
Update: 2024-06-25 14:04 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ నిందితుడి గురించి తవ్విన కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిహర్ లో నీట్ పేపర్ లీక్ చేసిన ప్రధాన నిందితుడి పేరు సంజీవ్ ముఖియా అని తేలింది. ఇతన్నీ లీక్ స్పెషలిస్ట్ అని పిలుస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరారీలో ఉన్న ముఖియా నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సూత్రధారి అని, ఈ లీక్ రాకెట్ వెనుక మేజర్ కీ రోల్ పోషించింది ఇతడే అని భావిస్తున్నారు. వాస్తవానికి సంజీవ్ ముఖియా ఇప్పటికే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
51 ఏళ్ల ముఖియాకు ఇంతకుముందు కూడా నేర చరిత్ర ఉంది. ముఖ్యంగా వివిధ పరీక్ష పేపర్ లను లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఐదు పబ్లిక్ పరీక్షల పేపర్ లను లీక్ చేశాడు. బీహార్ టీచర్ల రిక్రూట్‌మెంట్ పరీక్షలో పేపర్ లీక్‌లో ఇతడి ప్రమేయం ఉంది. ఈ లీక్ కేసులోనే అతడి కుమారుడు శివ కుమార్ కూడా అరెస్ట్ అయ్యాడు. పేపర్ లీక్ కావడంతో మూడో దశ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.
స్థానిక వార్తా పత్రికల కథనం ప్రకారం ముఖియా ఇందుకోసం ఓ ప్రత్యేక గ్యాంగ్ ను నడుపుతున్నాడు. ఈ అంతర్ రాష్ట్ర ముఠా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను కొనే అర్హత ఉన్న వారికోసం వెతికి వారికి విక్రయిస్తుంది. అలాగే అభ్యర్థులకు పరీక్షకు అవసరమైన ప్రాక్సీలను కూడా సమకూరుస్తుంది.
ముఖియా రెండు దశాబ్దాలుగా పరీక్ష లీక్ ల మోసాలకు పాల్పడుతున్నాడు. అంతకుముందు లీకేజీ ఆరోపణలు ఎదుర్కొన్న రంజిత్ డాన్ ముఠాతో కలిసి పని చేసేవాడనే అభియోగాలు ఉన్నాయి. రంజిత్ డాన్ ప్రీ ఆన్ లైన్ పరీక్షలు సహ క్యాట్, సీబీఎస్ఈ, మెడికల్ పరీక్షలు, పీజీ వైద్య పరీక్షలు సహ వివిధ పోటీ పరీక్షా పత్రాలను లీక్ చేసినట్లు ఆరోపణలతో అపఖ్యాతి పొందాడు. రంజిత్ 2015 లో లోక్ జనశక్తి పార్టీ తరఫున ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేశాడు.
కొన్ని నివేదికల ప్రకారం ముఖియా ఇంతకుముందు నలంద కళాశాల నూర్సరాయ్ బ్రాంచ్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించాడు. తన సొంతంగా నేర నెట్ వర్క్ ను నిర్మించుకున్నాడు. ఇప్పుడు మరో పేపర్ లీక్ నిందితుడు రవి అత్రితో కలిసి ఒక ముఠా నడుపుతున్నట్లు తెలుస్తోంది.
యూపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్‌కు పాల్పడినందుకు అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (UPSTF) ఈ ఏడాది ఏప్రిల్‌లో మీరట్ లో అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో లీకైన పేపర్‌లను పంపిణీ చేయడానికి విద్యార్థులను మనేసర్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించారు.
2017లో పాట్నాలోని పట్రాకర్ నగర్‌లో నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు ముఖియా, అతని కొడుకు గతంలోనూ అరెస్టయ్యారు. యుపి కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్ వెనుక ఉన్న డాక్టర్ శుభం మండల్‌తో పాటు వారిని అరెస్టు చేశారు. అయితే ముఖియా ఎప్పుడు బయటకు వచ్చాడనే వాటిపై క్లారిటీ లేదు.
సాల్వర్ గ్యాంగ్ నెట్‌వర్క్
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష అయినా లేదా టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షల లీక్ అయినా దాని వెనక ఈ ముఠా హస్తం ఉంది. ఇవి అనేక రాష్ట్రాల్లో తమ నెట్ వర్క్ ను విస్తరించాయి. 2016 బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష లీక్‌లో ముఖియా హస్తం కూడా ఉంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, ముఖియాకు రాజకీయాలు లక్ష్యాలు కూడా ఉన్నాయి. అతని భార్య, మమతా దేవి, భూతాఖర్ పంచాయతీకి 'ముఖియా' లేదా చీఫ్‌గా పనిచేస్తున్నారు, ఆమె లోక్ జనశక్తి పార్టీ నుంచి టిక్కెట్ పొందింది.
2024 నీట్ పేపర్ లీక్‌లో ముఖియా ప్రమేయం
అధికారుల ప్రకారం, ముఖియా 2024 పరీక్ష కోసం NEET-UG పత్రాలను లీక్ చేశాడని అన్నారు. తన మొబైల్ కి ప్రశ్న పత్రాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరికి పంపాడనే దానిపై ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ప్రధానంగా లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి.
ఇదిలా ఉండగా, బీహార్ ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తులో ముఖియా సన్నిహితుడు బల్దేవ్ కుమార్ అనే వ్యక్తి తన మొబైల్‌లో ప్రశ్నపత్రం పీడీఎఫ్, వాటి సమాధానాలకు సంబంధించిన షీట్ ను కూడా అందుకున్నాడని తేలింది. అంతకుముందు, నీట్ పరీక్షకు ఒక రోజు ముందు మే 4న పాట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌తో సంబంధం ఉన్న బాలుర హాస్టల్‌లో ముఖియా 25 మంది అభ్యర్థులకు వసతి కల్పించారు. బల్దేవ్ కుమార్‌కి సాల్వర్ పేపర్ వచ్చిన తర్వాత, అభ్యర్థులను సమాధానాలను గుర్తుంచుకోవడానికి పాఠశాలకు తీసుకెళ్లారు. జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు 'సాల్వర్ గ్యాంగ్' సభ్యులలో బల్దేవ్ ఒకరు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే NEET-UG 2024, 4,750 కేంద్రాలలో జరిగింది. 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. అయితే, ఫలితాలు ప్రకటించిన తర్వాత, బీహార్‌లో ప్రశ్నపత్రం లీక్ అయిందనే వాదనల మధ్య 67 మంది విద్యార్థులు 720కి 720 మంది టాప్ పర్ఫెక్ట్ స్కోర్లు సాధించినప్పుడు కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.