కుంభమేళ తొక్కిసలాట పిటిషన్ ను విచారించడానికి నిరాకరించిన ‘సుప్రీం’

హైకోర్టు, సుప్రీంకోర్టులో రెండు చోట్ల పిటిషన్ దాఖలు చేశారన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం;

Update: 2025-02-03 12:14 GMT

మహా కుంభమేళా లో జరిగిన తొక్కిసలాట పై దాఖలైన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తగిన ఉపశమనం కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా లో మౌనీ అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి నిలుచున్న భక్తుల మధ్య తోపులాట ప్రారంభం అయి, క్రమంగా తొక్కిసలాట జరిగింది.

ఈ దుర్ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. మరో 60 మందికి గాయాలయ్యాయి. కుంభమేళాకు వస్తున్న భక్తుల భద్రత కోసం నిర్ధిష్ట మార్గదర్శకాల కోసం దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు కోర్టు నిరాకరిచింది.

ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసు ఇంతకుముందే హైకోర్టులో దాఖలు చేశారని ప్రమాణ పత్రం దాఖలు చేశారని, మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారని అన్నారు.
తొక్కిసలాటను దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న సర్వొన్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేసిన విశాల్ తివారీ తిరిగి అలహబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఆయన వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించింది. తొక్కిసలాట జరిగిన ఘటన మరుసటి రోజు అంటే జనవరి 30 న పిటిషన్ దాఖలు చేశారు.
Tags:    

Similar News