కాశ్మీర్ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ప్రారంభమైన మంచు వర్షం
గజగజ వణుకుతున్న కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్
By : The Federal
Update: 2024-12-09 12:56 GMT
ఉత్తర భారతం చలితో గజగజ వణుకుతోంది. ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతామైన జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో ఉష్ఱోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. లోయలోని గుల్మార్గ్ లో ఉష్ణోగ్రత మైనస్ 9 డిగ్రీలుగా నమోదైంది. ఇక్కడ ఆదివారం రాత్రి నుంచి మంచుకురవడం ప్రారంభమైంది. ఈ సీజన్ ఇది మొదటి సారి. అమర్‌నాథ్ యాత్రకు బేస్ క్యాంప్‌గా పనిచేస్తున్న పహల్గామ్‌లో కనిష్టంగా మైనస్ 6.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వారు తెలిపారు.
శ్రీనగర్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 3.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కాశ్మీర్‌కు గేట్‌వే పట్టణమైన ఖాజీగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, దక్షిణ కాశ్మీర్‌లోని కోకెర్‌నాగ్‌లో మైనస్ 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
డిసెంబరు 12న లోయలోని ఎత్తైన ప్రాంతాలలో తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉన్నందున రాబోయే 10 రోజుల్లో కాశ్మీర్‌లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. డిసెంబర్ మూడో వారం నుంచి కాశ్మీర్ లో అత్యంత చల్లని వాతావరణం ఉంటుందని, దాదాపు 40 రోజుల పాటు ఈ తరహ మంచు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అలాగే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచు కురుస్తుడటంతో టూరిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మంచుతో ఆడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.