ఆదివారం రెస్టారెంట్ లో లంచ్ చేసిన గాంధీ కుటుంబం
ఆ హోటల్ లో ఎలాంటి వేరైటీ ట్రయ్ చేయాలో చెప్పిన రాహుల్ గాంధీ
By : The Federal
Update: 2024-12-23 06:25 GMT
కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజిగా ఉంటున్న గాంధీ కుటుంబం.. ఆదివారం విరామాన్ని సరదాగా గడిపింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని ప్రముఖ క్వాలిటీ రెస్టారెంట్ లో ఆదివారం లంచ్ ను ఆస్వాదిస్తూ కనిపించింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మీరయా, అత్తగారు మౌరీన్ వాద్రా రెస్టారెంట్‌లో భోజనం చేశారు.
"ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో ఫ్యామిలీ లంచ్. మీరు వెళ్తే చోలే భతుర్ ప్రయత్నించండి" అనే క్యాప్షన్‌తో రాహుల్ గాంధీ లంచ్ చేస్తున్న చిత్రాలను పోస్ట్ చేశారు. రెస్టారెంట్ నార్త్ ఇండియా గొప్ప వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా చోలే భతుర్‌కు ప్రసిద్ధి చెందింది.
Family lunch at the iconic Kwality Restaurant. Try the Chole Bhature if you go. - Rahul Gandhi ❤️❤️ pic.twitter.com/xf1bf5hQyQ
— Delhi Pradesh Congress Sevadal (@SevadalDL) December 22, 2024