శ్రీ కృష్ణ జన్మస్థానం: సున్నీం వక్ఫ్ బోర్డు పిటిషన్ ను కొట్టివేసిన..
మథుర దేవాలయం- మసీద్ కు సంబంధించిన వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ వివాదంపై దాఖలు అయిన అన్ని పిటిషన్ల..
By : The Federal
Update: 2024-08-01 10:13 GMT
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు మసీదు కమిటీకి షాక్ ఇచ్చింది. ఈ వివాదంపై దాఖలు అయిన 18 కేసులను విచారణకు స్వీకరించవచ్చని, మసీదు కమిటీ వేసిన కేసులను తోసిపుచ్చింది. న్యాయమూర్తి మయాంక్ కుమార్ జైన్ జూన్ 6న దావాల నిర్వహణకు సంబంధించి ముస్లిం పక్షం చేసిన పిటిషన్‌పై తన తీర్పును రిజర్వ్ చేశారు. ఈ సమస్యలపై విచారణకు న్యాయస్థానం ఇప్పుడు ఆగస్టు 12 తేదీగా నిర్ణయించింది.
శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదును "తొలగించాలంటూ" హిందూ పక్షాలు కేసు దాఖలు చేశాయి. మథుర లో ఉన్న ఆలయాన్ని కూల్చి వేసిన ఔరంగ జేబు .. మసీదు నిర్మించారని పిటిషన్ల లో హిందూపక్షాలు పేర్కొన్నాయి.
కానీ మసీదు నిర్వహణ కమిటీ, యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఇవన్నీ కల్పితమని వాదిస్తున్నాయి. అలాగే 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం మసీదు అలాగే కొనసాగించాలని కోరుతున్నాయి. ఈ చట్టం ప్రకారం స్వతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ప్రార్థన స్థలాలు ఎలా ఉన్నాయో.. అలాగే కొనసాగించాలని చెబుతుంది.
ఇప్పటికే అయోధ్య ను న్యాయపరంగా గెలుచుకున్న హిందూ పక్షం.. అక్కడ వైభవంగా ఆలయాన్ని నిర్మించి బాల రాముడిని ప్రతిష్టించాయి. తరువాత కాశీలోని విశ్వేశ్వర ఆలయానికి సంబంధించి కూడా కోర్టులో కేసులు దాఖలు చేశారు. దీనికి సంబంధించి పురావస్తు శాఖ అధికారులు సర్వే చేసి కోర్టుకు నివేదిక సమర్పించారు.
జ్ఞాన్ వాపీ మసీదు ప్రాంగణంలో వజుఖానాలో పురాతన శివలింగం లాంటి నిర్మాణం ఉందని పేర్కొంది. దీనిపై కార్బన్ డేటింగ్ నిర్వహించాలని సూచించింది. అలాగే మసీదులో త్రిశూలం, గణపతి, అమ్మవారు, ఇతర హిందూ దేవుళ్ల ప్రతిమలు కనిపిస్తున్నాయని కూడా నివేదిక లో కోర్టు ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇక్కడ సున్నీ బోర్డు చేసిన వాదనలు వీగిపోయాయి.