ప్రధాని మోదీ వచ్చాకనే ఢిల్లీ సీఎం పేరు ప్రకటన

అందరి చూపు పర్వేశ్ వర్మ పైనే, అమిత్ షాతో సమావేశమైన జేపీ నడ్డా;

Update: 2025-02-09 12:19 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీఎం ఎంపిక విషయంలో మాత్రం తుది నిర్ణయం ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాతనే అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ దాదాపు 26 సంవత్సరాల తరువాత అధికారంలోకి రావడంతో ప్రమాణస్వీకారాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. దీనికి ఎన్డీఏలోని ముఖ్య నేతలు హజరవుతారని కొన్ని మీడియా సంస్థలు తెలియజేస్తున్నాయి.
అమిత్ షాతో సమావేశమైన నడ్డా
బీజేపీ, ఢిల్లీ ఎన్నికలలో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కమలం పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా కసరత్తును ప్రారంభించింది. దీనికి సంబంధించి పార్టీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ ఈ విజయం పై పార్టీ కార్యకర్తలతో విక్టరీ స్పీచ్ మాట్లాడిన తరువాత కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామం తరువాత ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ ఎన్నికల్లో గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తన ఎంపికగా ఓ అభ్యర్థిని సూచించవచ్చని తెలుస్తోంది.
అయితే అందరి దృష్టి పర్వేశ్ వర్మ పైనే ఉంది. ఆయన కేజ్రీవాల్ ను ఓడించడంతో రాత్రికి రాత్రే మంచి క్రేజ్ ను దక్కించుకున్నాయి.
నిజంగా పర్వేష్ అదృష్టవంతుడా?
పర్వేష్ వర్మ ఇంతకుముందు రెండుసార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపికగా ఎన్నికయ్యారు. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి పార్టీ దింపింది.
ఆయన నేరుగా కేజ్రీవాల్ పై పోటీకి దిగారు. ఫలితంగా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేజ్రీవాల్ కు ఈ సారి ఓటమి రుచిచూపించారు. పైగా ఆయన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఈ ప్రచారం పై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధినాయకత్వం కొత్త సీఎం ఎవరని ప్రకటిస్తుందని, అధిష్టానం నిర్ణయం తమకు శిరోధార్యమని అన్నారు. ‘‘ ఇది మాములు విజయం కాదు. ఇది ఢిల్లీ ప్రజల విజయం. అబద్దాలలో నిజాన్ని ఎంచుకున్నారు. గిమ్మికులతో పాలిస్తున్నవారికి ప్రజలు బుద్ది చెప్పారు’’ అన్నారు.
బీజేపీ ఏం చేయబోతోంది..
వివిధ రాష్ట్రాలలో బీజేపీ ఎంపిక చేసిన ముఖ్యమంత్రులను పరిశీలిస్తే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్వేశ్ వర్మ తో పాటు సతీష్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, అశిద్ సూద్, పవన్ శర్మ వంటి అనుభవజ్ఞులైన నాయకులు గురించి వివిధ కార్యకర్తల్లో ప్రచారం జరుగుతోంది.
బీజేపీ చరిత్రను పరిశీలిస్తే.. తక్కువ ప్రొఫైల్ ఉండి, ప్రజల్లో పెద్దగా నోటేడ్ కానీ వ్యక్తులకు అందలం ఎక్కించినట్లు తెలుస్తోంది. ఇందుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలే ఉదాహారణ. పార్టీ అగ్రనేతలను నడిపించే రాజకీయ లెక్కలను బట్టి పూర్వాంచల్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా సీఎం పదవిలో కూర్చోబెట్టవచ్చని ఓ బీజేపీ నాయకుడు అన్నారు.
2023 ఎన్నికల్లో ..
మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు 2023 లో జరిగాయి.. ఒడిశా లో గెలిచిన తరువాత ఎవరూ ఊహించని పరిణామాలను బీజేపీ ప్రారంభించింది. మధ్య ప్రదేశ్ లో మోహన్ యాదవ్, రాజస్థాన్ లో భజన్ శర్మ, ఒడిశాలో మోహన్ చరణ్ మాఘీని బీజేపీ అధికారం కట్టబెట్టింది. ఇది చాలామంది రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.
Tags:    

Similar News