ఓటు వేసే ముందు ఓసారి ఆలోచించండి: రాహుల్ గాంధీ

ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణాలకు పాల్పడింది ఎవరని గుర్తుంచుకోండని ఎక్స్ లో ట్వీట్;

Update: 2025-02-05 09:31 GMT

ఢిల్లీ అసెంబ్లీకి ఓ వైపు ఎన్నికలు జరుగుతుండా, కాంగ్రెస్ నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆప్ పై ఆరోపణలు గుప్పించారు. ఓటు వేసే ముందు ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణాలకు పాల్పడింది ఎవరో ఒకసారి ఓటర్లు గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారి హక్కులను తాము కాపాడుతామని రాజ్యాంగాన్ని బలోపేతం చేస్తుందని, ఢిల్లీని మరోసారి ప్రగతి పథంలోకి తీసుకుకెళ్తుందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.
ఓటు వేసిన రాహుల్ గాంధీ
ఢిల్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఉదయమే ఓటు వేశారు. అంతకుముందు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ నా ప్రియమైన ఢిల్లీ సోదర సోదరిమణులారా. ఈ రోజు మీరందరూ ఓటు వేయాల్సిందిగా నేను కోరుతున్నారు. కాంగ్రెస్ కు మీరు వేసే ప్రతి ఓటు మీ హక్కులను కాపాడుతుంది. రాజ్యాంగాన్ని బలోపేతం చేస్తుంది. ఢిల్లీని తిరిగి పురోగతి పథంలోకి నడిపిస్తుంది.’’ అని ఆయన ఎక్స్ లో హిందీలో పోస్ట్ చేశారు.
వరుసగా మూడో సారి అధికారంలోకి..
‘‘ ఓటు వేసే సమయంలో కలుషితమైన గాలి, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యత వహిస్తారో గుర్తుకు తెచ్చుకోండి. స్వచ్ఛమైన రాజకీయాలను ఆచరించడం గురించి మాట్లాడుతూ.. ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణానికి ఎవరు పాల్పడ్డారో ఓ సారి ఆలోచించండి’’ అని గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఢిల్లీ కిరిటాన్ని వరుసగా మూడో సారి చేజిక్కించుకోవాలని ఆప్ చూస్తుండగా, దానికి బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని తిరిగి పొందడానికి కృషి చేస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో 70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక్కడ ఈసీ మొత్తం 13,766 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 1998 నుంచి 2013 వరకూ వరుసగా 15 సంవత్సరాలుగా ఢిల్లీ పీఠం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. అక్కడ షీలా దీక్షిత్ సీఎంగా చక్రం తిప్పారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కు ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా లేదు.
ప్రస్తుతం ఢిల్లీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకూ కేవలం 33 శాతం వరకూ మాత్రమే పోలింగ్ నమోదైంది. వీవీఐపీలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Tags:    

Similar News