ఈ ఆరోగ్య రాముడు..120 ఏళ్ల క్రితమే అయోధ్యకి వచ్చాడు

అయోధ్య.. హిందూవుల పవిత్ర స్థలం. ఐదు వందల ఏళ్ల తరువాత బాలరాముడు తిరిగి ఆలయంలో ప్రతిష్టించబడి పూజలు అందుకుంటున్నాడు. అయితే ఇక్కడే మరో ఆరోగ్య రాముడు ఉన్నాడు

Update: 2024-02-05 09:14 GMT

అయోధ్య వాసులందరీకి అక్కడ నెలకొన్న మరో ఆరోగ్య రాముడు కూడా బాగా తెలుసు. రామమందిరం నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఇప్పుడు ఉన్న రామమార్గ్ లోనే ఈ రాముడు ఉన్నాడు. 120 సంవత్సరాల క్రితమే.. ఇక్కడ ఓ దాత ఈ రాముడిని అయోధ్య వాసులకి పరిచయం చేశాడు.. ఉచితంగా

ఆ ఆరోగ్య రాముడు ఎవరో కాదు.. ‘రాజ్ కియా శ్రీరామ హస్పిటల్’. ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రికి 1900 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ఐసీఎస్ కమిషనర్ ఆఫ్ ఫైజాబాద్ జే. హూపర్ శంకుస్థాపన చేశారు.

1902 న ఆగ్రా, అవధ్ ప్రావిన్స్ చెందిన లెప్టినెంట్ గవర్నర్ హెచ్ హెచ్ సర్ జేమ్స్ డిగ్గెస్ లాటౌచ్ చే ఇదీ ప్రారంభించబడింది. ఈ ఆస్పత్రి దాత రాయ్ శ్రీ రామ్ బహదూర్. ఆయన పేరు మీదే ఇదీ ఇప్పటికీ నడుస్తోంది.

శ్రీరామ్ అప్పటికే ప్రముఖ న్యాయవాదీ, తాలుక్ దార్.. అప్పటి బ్రిటిష్ గెజిట్ కూడా ఈ విషయాన్ని ప్రకటించింది. "రసూల్ పూర్ కు చెందిన శ్రీరామ్ బహదూర్ పట్టణానికి ఇచ్చిన ఫస్ట్ క్లాస్ హాస్పిటల్. ఇదీ అతని పేరుతోనే పిలవబడుతోంది" అని అందులో వెల్లడించింది.

అయితే ఇప్పటికీ చాలామంది అయోధ్య రామ్ జన్మభూమి కావడంతోనే.. శ్రీ రాముడి పేరుతో హాస్పిటల్ నిర్మించి, నడిపిస్తున్నారని అనుకుంటూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు.

ఈ ఆస్పత్రిని 1949 లోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1960 లో గెజిట్ లో ప్రచురించింది. 1953 లో ఒక ఎక్స్ రే మిషన్ ను ప్రభుత్వం అందించింది. తరువాత మెల్లగా సేవలు విస్తరిస్తూ పోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో పీడీయాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాజీ వంటి సేవలు అందిస్తోందని, ఆస్పత్రి సూపరిండేంట్ ప్రకాష్ సింగ్ చెబుతున్నారు.

చాలామందికీ ఇదీ ప్రభుత్వ ఆస్పత్రి అని తెలియదు. ఇదీ ప్రయివేట్ ఆస్పత్రి అయినప్పటీకీ ఉచితంగా సేవలు అందిస్తున్నారనే ప్రజలు భావిస్తున్నారని, సేవలు కూడా అదే స్థాయిలో అందుతాయని ఆయన చెబుతున్నారు.

"ఒకప్పుడు ఆస్పత్రి గులాబీ రంగులో ఉండేది. కానీ ఇప్పుడు పసుపు రంగుకు మారింది. ఇక్కడికి అయోధ్య, ఫైజాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న గోండా, బస్తీ జిల్లాల ప్రజలు కూడా వస్తుంటారు" అని సింగ్ చెబుతున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభం కావడం వల్ల పేషంట్ల తాకిడి పెరిగిందని వెల్లడించారు.

ఆలయం ప్రారంభోత్సవం రోజు కూడా స్పృహ తప్పిపోయిన భక్తులకు ఇక్కడి చికిత్స అందించినట్లు వివరించారు. " ఇక్కడ మొత్తం 120 పడకలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ కు అనుగుణంగా భగవాన్ రిషభ్ దేవ్ కంటి హాస్పిటల్ కూడా ఉంది" శ్రీరామ్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ చెప్పారు.

అయోధ్య లో ఈ హాస్పిటల్ కాలానికి సాక్షిభూతంగా నిలిచిందని ప్రకాష్ సింగ్ అంటున్నారు. "ఒకప్పుడు బాబ్రీ మసీద్ కాలంలో అనుక్షణం టెన్షన్ గా ఉండేది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆలయం నిర్మించబడి బాలరాముడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు" ఆయన పాత అనుభవాలను నెమరువేసుకున్నారు.

" ఆలయం ప్రహారీ మాకు దగ్గరే.. నిత్యం అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ తెలుస్తూనే ఉంటాయి, మా ఆస్పత్రి కూడా ఇప్పటికీ ఎల్లో జోన్ లోనే ఉంది" అని చెబుతున్నారు. భక్తులు తాకిడీ పెరగడం, దేశ వ్యాప్తంగా ఉన్న వారంతా భక్తులు ఇక్కడికి వస్తుండడంతో ఆస్పత్రిని విస్తరించే ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    

Tags:    

Similar News